TTD : తిరుపతి – విజయవాడలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 26 నుండి 31వ తేదీ వరకు అష్టబంధన జీర్ణోద్దారణ మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు టీటీడీ (TTD) ఈవో జె. శ్యామల రావు. ఆగమ శాస్త్ర నిబంధనల మేరకు శాస్త్రోక్తంగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అష్టబంధన మహా సంప్రోక్షణ చేపట్టడం ఆచారంగా వస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జూలై 26వ తేదీ శనివారం సాయంత్రం 6.30 నుండి రాత్రి 08.30 గం.ల వరకు మృత్సం గ్రహణము, అంకురార్పణం చేపట్టనున్నారు.
TTD Interesting Comments
ఇందులో భాగంగా జూలై 27వ తేదీ ఉదయం 09.00 – 12.00 గం.ల వరకు అగ్ని మథనం, పంచాగ్ని ప్రణయనం, అగ్ని ప్రతిష్ట, సాయంత్రం 06.30 గం.లకు బింబాత్ కుంభే కళాపకర్షణ, ఉపచార సమర్పణము, ఉక్త హోమములు చేపడతారు. జూలై 28న సోమవారం ఉదయం 09.00 గం.లకు నవగ్రహారాధన, నవగ్రహమఖము, ప్రధాన హోమాలు, సాయంత్రం 06.30 గం.లకు ఉత్క హోమములు, కుంభ రాధనలు, అభి మంత్రణము నిర్వహిస్తారు. జూలై 29వ తేదీన ఉదయం 09.00 గం.లకు సర్వ శాంతి హోమములు, సాయంత్రం 06.30 సర్వ దోషాపశమనార్ధం సహస్రాహుతి హోమాలు చేపడుతారు.
జూలై 30వ తేదీ ఉదయం 9.00గం.ల నుండి అష్టబంధన ద్రవ్యా రాధనము, మహా శాంతి హోమములు, ఉష్ణ బంధనము, అష్టబంధ ప్రయోగం, సాయంత్రం 04.00 గం.లకు సర్వ దోష ప్రాయశ్చిత్త శాంతి హోమం, రాత్రి 07.00 గం.లకు మహా శాంతి తిరుమంజనము, ధాన్యా ధివాసము, సర్వ దైవత్య హోమం చేపడుతారు. జూలై 31వ తేదీ ఉదయం 07.30 గం.లకు మహా పూర్ణాహుతి, ఆలయ ప్రవేశం, అనంతరం చిత్త నక్షత్ర యుక్త గురువారము తులాలగ్న శుభ ముహుర్తమున ఉదయం 11.25 గం.ల నుండి 12.24 గం.ల వరకు కళావాహనం, ప్రథమ కాలార్చనము, మహా సంప్రోక్షణ, అక్షతారోహణ, బ్రహ్మ ఘోష తదితర కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు.
Also Read : GHMC Approved HYDRA : హైడ్రాకు జీహెచ్ఎంసీ సంపూర్ణ సహకారం
