National SC Commission Strong Reaction : ఎంపీ ఆవేద‌న జాతీయ ఎస్సీ క‌మిషన్ స్పంద‌న

చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసుల జారీ

Hello Telugu - National SC Commission Strong Reaction

Hello Telugu - National SC Commission Strong Reaction

National SC Commission : చిత్తూరు జిల్లా : చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని దేవళంపేట గ్రామంలో డా. బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహాన్ని దహనం చేసిన ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ (National SC Commission) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఫిర్యాదు చేసిన రెండు గంటల లోపే కమిషన్ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు 30 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాల‌ని ఆదేశించింది. ఆదేశిస్తూ నివేదికలో ఎఫ్.ఐ.ఆర్ వివరాలు, నమోదు చేసిన సెక్షన్లు, అరెస్టులు, చార్జ్ షీట్ స్థితి తదితర సమాచారం ఇవ్వాల్సిందేనంటూ స్పష్టం చేసింది జాతీయ ఎస్సీ క‌మిష‌న్.

National SC Commission Response

ఇదే స‌మ‌యంలో కీల‌క వార్నింగ్ కూడా ఇచ్చింది. నిర్దిష్ట గడువులో నివేదిక అందించనట్లయితే, భారత రాజ్యాంగం ఆర్టికల్ 338 ప్రకారం సివిల్ కోర్ట్ అధికారాలను వినియోగించి, సంబంధిత అధికారులను వ్యక్తిగతంగా లేదా ప్రతినిధి ద్వారా కమిషన్ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేయనున్నట్లు హెచ్చరించింది షెడ్యూల్డ్ కులాల భద్రత, గౌరవం కాపాడటంలో కమిషన్ కట్టుబడి ఉందని, సామాజిక న్యాయం ప్రతీకలపై జరుగుతున్న దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా ఏపీలో కూట‌మి స‌ర్కార్ కొలువు తీరాక బ‌డుగు, బ‌ల‌హీన, ద‌ళితులపై వేధింపులు, క‌క్ష సాధింపులు పెరిగి పోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దాడులు పెరిగి పోయాయ‌ని మండిప‌డ్డారు. అక్ర‌మ కేసులు న‌మోదు చేయ‌డం దారుణ‌మ‌న్నారు ఎంపీ మ‌ద్దెల గురుమూర్తి.

Also Read : Manda Krishna Madiga Strong Demand : లీడ్ క్యాప్ భూముల లీజు రద్దు చేయండి

Exit mobile version