Manda Krishna Madiga Strong Demand : లీడ్ క్యాప్ భూముల లీజు రద్దు చేయండి

డిమాండ్ చేసిన ఎంఆర్పీఎస్ చీఫ్ మంద‌కృష్ణ‌

Hello Telugu - Manda Krishna Madiga Strong Demand

Hello Telugu - Manda Krishna Madiga Strong Demand

Manda Krishna Madiga : హైద‌రాబాద్ : హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న లిడ్ క్యాప్ కు సంబంధించిన భూములను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు లీజుకు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో (GO) ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి (ఎంఆర్పీఎస్) అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ (Manda Krishna Madiga). తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లిడ్ క్యాప్ భూములను , ఆస్తులను పరిరక్షించాలని అన్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న ఐటీ , ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబును క‌లిశారు. విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు. లిడ్ క్యాప్ అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని అన్నారు. అంతే కాకుండా లిడ్ క్యాప్, లేదర్ వర్క్ మీద సమగ్రమైన అవగాహన కలిగిన అధికారిని మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించాలని స్ప‌ష్టం చేశారు మంద‌కృష్ణ మాదిగ‌.

Manda Krishna Madiga Strong Demand

తక్షణమే లిడ్ క్యాప్ భూములను పెట్రోల్ బంక్ , యూనిట్ మాల్ కు కేటాయిస్తూ ఇచ్చిన జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేక పోతే పెద్ద ఎత్తున మాదిగ‌లు ఆందోళ‌న బాట ప‌డ‌తార‌ని వార్నింగ్ ఇచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించ‌క పోతే బాగుండ‌ద‌న్నారు. దీంతో ఈ డిమాండ్ల మీద మంత్రి సానుకూలంగా స్పందించార‌ని తెలిపారు మంద‌కృష్ణ మాదిగ‌. తన పరిధిలో ఉన్న డిమాండ్లను తక్షణమే పరిష్కారం చేస్తానని, పెట్రోల్ బంక్ లీజును రద్దు చేస్తామని, అలాగే మిగితా డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తామని హామీ ఇచ్చార‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లిడ్ క్యాప్ భూములను పరిరక్షించడం కోసం ఆ భూముల చుట్టూ ప్రహరీ గోడలు నిర్మిస్తామని , భూములు కబ్జాకు గురి కాకుండా చూస్తామని చెప్పార‌న్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ చర్మకారుల జెఎసి చైర్మన్ అరేపల్లి రాజేందర్, MRPS రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ , MSP జాతీయ నేత మంథని సామేల్ , చర్మకారుల జెఎసి కన్వీనర్ ములుగు రాజు మాదిగ , సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

Also Read : Upendra Dwivedi Fired on Pakistan : పాకిస్తాన్‌ను భూగోళంలో లేకుండా చేస్తాం : ఆర్మీ చీఫ్

Exit mobile version