సిద్ధరామయ్యకు జాతీయ స్థాయి పదవి

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఏఐసీసీ హై క‌మాండ్

hellotelugu-siddaramaiah

న్యూఢిల్లీ : క‌ర్ణాట‌క రాజ‌కీయాల‌లో అపార‌మైన అనుభ‌వంతో పాటు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ క‌లిగిన మాజీ ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య‌కు ఊహించ‌ని రీతిలో బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది ఏఐసీసీ హైక‌మాండ్. ఈ మేర‌కు ఆయ‌న‌కు పార్టీ ప‌రంగా ఏఐసీసీలో కీల‌క‌మైన ప‌ద‌విని ప్ర‌క‌టించింది. పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను సభ్యుడిగా కాంగ్రెస్ నియమించింది. ఇందుకు సంబంధించిన విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించారు ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్. పార్టీ ప‌రంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. సిద్ద‌రామ‌య్యకు కీల‌క‌మైన ప‌ద‌విని క‌ట్ట‌బెట్టేందుకు పార్టీ అధిష్టానం నిర్ణ‌యించింద‌ని తెలిపారు. ఇది త‌క్ష‌ణ‌మే అమ‌లులోకి వ‌స్తుంద‌ని ప్ర‌కటించారు.

ఇదిలా ఉండగా, కేబినెట్ పదవుల కోసం కాంగ్రెస్ హైకమాండ్‌తో సమావేశాలు జరిపిన అనంతరం డీకే శివకుమార్ ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్నారు. ఆయ‌న ఇవాళ జూన్ 3న బుధ‌వారం క‌ర్ణాట‌క రాష్ట్ర నూత‌న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్ప‌టికే అధికారికంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. క‌ర్ణాట‌క పాలిటిక్స్ లో ట్రబుల్ షూట‌ర్ గా పేరు పొందారు డీకే శివ‌కుమార్. ఆయ‌న‌కు గ‌త్యంత‌రం లేక పార్టీ కీల‌క‌మైన పోస్టును అప్ప‌గించాల్సి వ‌చ్చింది. దీంతో ఇప్ప‌టి దాకా తానే కీల‌క‌మైన నేతనంటూ ప్ర‌క‌టిస్తూ వ‌స్తున్న సీఎం రేవంత్ రెడ్డికి చెక్ పెట్టింది హై క‌మాండ్.

Exit mobile version