Nara Lokesh Clear Instructions : పున‌రావాస చ‌ర్య‌లు చేప‌ట్టండి : లోకేష్

ఆర్టీజీఎస్ నుండి మంత్రి మానిట‌రింగ్

Hello Telugu - Nara Lokesh Clear Instructions

Hello Telugu - Nara Lokesh Clear Instructions

Nara Lokesh : అమ‌రావ‌తి : మొంథా తుపాను ప్ర‌భావం కొనసాగుతోంది. ప్ర‌ధానంగా ఏపీతో పాటు త‌మిళ‌నాడు రాష్ట్రాల‌ను వ‌ణికిస్తోంది. గంట‌కు 90 నుంచి 100 కిలోమీట‌ర్ల‌కు పైగా ఈదురు గాలులు వీస్తున్నాయి. ఎక్క‌డ చూసినా వ‌ర్షాలు కురుస్తున్నాయి ఎడ తెరిపి లేకుండా. దీంతో స‌ర్కార్ అప్ర‌మ‌త్తమైంది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం సైతం రంగంలోకి దిగారు. స‌మీక్ష‌లు నిర్వ‌హించారు. అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. మ‌రో వైపు మంత్రులు మానిటరింగ్ చేయ‌డంలో మునిగి పోయారు. ఇదిలా ఉండ‌గా మంగ‌ళ‌వారం తుపాను తాకిడి తీవ్రం కావ‌డంతో సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షించే ప‌నిలో ప‌డ్డారు విద్య‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.

Minister Nara Lokesh Key Comments

పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసి తదనుగుణంగా సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.. నిన్నటి నుంచి వివిధ జిల్లాల్లో కురిసిన వర్షపాతంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని స్ప‌ష్టం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కూటమి నేతలు, కార్యకర్తలు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని దిశా నిర్దేశం చేశారు నారా లోకేష్‌ (Nara Lokesh). మ‌రో వైపు విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌, హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత సైతం ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో మాట్లాడారు. త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్ ద‌ళాల‌ను ఉప‌యోగించు కోవాల‌ని, లోత‌ట్టు ప్రాంత ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Tejashwi Yadav Shocking Comments : ద‌మ్ముంటే సీఎం పేరు ప్ర‌క‌టించాలి

Exit mobile version