Nara Lokesh : అనంతపురం జిల్లా : రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన అనంతపురం జిల్లా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. జిల్లాలోని కల్యాణదుర్గం పట్టణంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతల సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఉన్న అనుభవంతో రాష్ట్రాన్ని సమర్థంగా ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. ఏపీని చూసి పొరుగు రాష్ట్రాలు అసూయపడే రోజు తీసుకు వస్తామని స్పష్టం చేశారు నారా లోకేష్. తెలుగుదేశం పార్టీ అంటే అనంతపురం అని అనంతపురం అంటే తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాకు ఎంత చేసినా తక్కువేనని చెప్పారు. జగన్ రెడ్డి ఏనాడు సొంత కార్యకర్తలను పట్టించు కోలేదన్నారు.
Minister Nara Lokesh Key Comments
కార్యకర్తే అధినేత అని ప్రకటించిన పార్టీ తెలుగుదేశం అని ఆ విషయం గుర్తు పెట్టుకోవాలని నారా లోకేష్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, నేతలకు సూచించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను కోరారు. ప్రతి ఒక్కరికి భీమా సదుపాయం కల్పించడం జరుగుతోందన్నారు. పార్టీ అంటేనే కుటుంబం అని, ఇందులో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకునేందుకు తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు నారా లోకేష్. దేశంలో ఏ పార్టీకి లేనంతమంది మన పార్టీకి ఉన్నారని చెప్పారు. ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు.
Also Read : DY CM Bhatti Vikramarka Important Update : త్వరలోనే రూ. 600 కోట్లు విడుదల చేస్తాం
