Bhatti Vikramarka : హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీలక ప్రకటన చేశారు ప్రజాభవన్‌లో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో చర్చలు జరిపారు. ఈ సందర్బంగా జరిగిన కీలక మీటింగ్ లో రాష్ట్ర రోడ్లు భవనల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని తమ సర్కార్ నిర్ణయం తీసుకుందన్నారు. కానీ ఒత్తిడి తీసుకు రావడం మంచి పద్దతి కాదని హితవు పలికారు. తాము ఫ్రెండ్లీ సర్కార్ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఉన్న బకాయిలకు సంబంధించి సమీక్ష చేపట్టామన్నారు.
DY CM Bhatti Vikramarka Key Comments
ఇందులో భాగంగా ఇప్పటికే రూ. 600 కోట్లు విడుదల చేయడం జరిగిందని, మరో రూ. 600 కోట్లు వెంటనే విడుదల చేస్తామని వెల్లడించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. మిగిలిన 300 కోట్లు కూడా త్వరలో క్లియర్ చేస్తామని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేసి, యాజమాన్యాల ప్రతినిధులతో కలిసి అవసరమైన సంస్కరణలను చర్చిస్తామన్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ విద్యార్థుల ప్రయోజనాలు, విద్యా వ్యవస్థ స్థిరత్వం కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆయా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయొద్దని కోరారు భట్టి విక్రమార్క. విద్యార్థులు చదువు కోలేకనే మీ సంస్థలలో చేరారని ఆ విషయం గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
Also Read : MSK Prasad Interesting Comments : శ్రీచరణి నేటి యువతకు రోల్ మోడల్
