Nara Lokesh Assures-Nepal Sensational :నేపాల్ లో చిక్కుకున్న వారికి లోకేష్ భ‌రోసా

ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని సూచ‌న

Hello Telugu - Nara Lokesh Assures-Nepal Sensational

Hello Telugu - Nara Lokesh Assures-Nepal Sensational

Nara Lokesh : అమ‌రావ‌తి : నేపాల్ ఆందోళ‌న‌ల‌తో అట్టుడుకుంతోంది. సోష‌ల్ మీడియాపై నిషేధం విధించ‌డాన్ని నిర‌సిస్తూ ప్ర‌జ‌లు రోడ్డెక్కారు. ఈ ఘ‌ట‌న‌లో ఆర్మీ కార‌ణంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సమ‌యంలో ఆయా దేశాల‌కు చెందిన ప‌లువురు చిక్కుకున్నారు. అక్క‌డి హొటళ్ల‌లో త‌ల దాచుకున్నారు. ఇదే స‌మ‌యంలో ఏపీకి చెందిన ప‌లువురు తెలుగు వారు నేపాల్ కు వెళ్లారు. అక్క‌డ బిక్కుబిక్కుమంటూ బ‌తుకుతున్నారు. విష‌యం తెలుసుకున్న వెంట‌నే మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అన్ని అధికారిక కార్య‌క్ర‌మాల‌ను ర‌ద్దు చేసుకున్నారు. హుటా హుటిన స‌చివాల‌యానికి చేరుకున్నారు. ఏపీ ఆంధ్రా భ‌వ‌న్ లోని అధికారుల‌తో మాట్లాడారు.

Nara Lokesh Assures

బుధ‌వారం రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కి చేరుకున్న ఆయ‌న అక్క‌డి అధికారుల నుంచి వివ‌రాలు ఆరా తీశారు. నేపాల్ లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారి వివరాలను మంత్రి నారా లోకేష్ కు వివరించిన ఏపీ భవన్ అధికారులు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు నేపాల్ లో ఏపీకి చెందిన వారు 215 మంది చిక్కుకు పోయార‌ని వెల్ల‌డించారు. వారికి భ‌రోసా ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి లోకేష్.

నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చెయ్యాలని లోకేష్ ఆదేశించారు. ఇదే స‌మ‌యంలో కేంద్రంతో మాట్లాడ‌తామ‌ని చెప్పారు ప్రతి రెండు గంటలకు నేపాల్ లో చిక్కుకున్న వారి క్షేమ సమాచారం తెలుసు కోవాలని సూచించారు. నేపాల్ లో చిక్కుకున్న కొంత మంది తెలుగు వారితో విడియో కాల్ లో మాట్లాడారు. నేపాల్ లో చిక్కుకున్న బాధితురాలు సూర్య ప్రభ తో మాట్లాడారు. అక్క‌డ చోటు చేసుకున్న ప‌రిస్థితిని మంత్రికి వివ‌రించారు.

Also Read : YS Sharmila Fired on AP Govt : హామీలు ఘ‌నం ఆచ‌రణ శూన్యం : ష‌ర్మిల

Exit mobile version