YS Sharmila Fired on AP Govt : హామీలు ఘ‌నం ఆచ‌రణ శూన్యం : ష‌ర్మిల

కూట‌మి ప్ర‌భుత్వం ఘోర వైఫ‌ల్యం

Hello Telugu - YS Sharmila Fired on AP Govt

Hello Telugu - YS Sharmila Fired on AP Govt

YS Sharmila : అమ‌రావ‌తి : ఏపి కూట‌మి స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిలా రెడ్డి. హామీల పేరుతో ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని, గ‌ద్దెను ఎక్కిన త‌ర్వాత వాటి గురించి మ‌రిచి పోయారంటూ మండిప‌డ్డారు. ఏం సాధించార‌ని అనంత‌పురంలో సూప‌ర్ సిక్స్ సూప‌ర్ హిట్ అని స‌భ నిర్వ‌హిస్తున్నారంటూ ప్ర‌శ్నించారు. ఇదంతా పూర్తిగా బ‌క్వాస్ అంటూ కొట్టి పారేశారు. బుధ‌వారం వైఎస్ ష‌ర్మిలా రెడ్డి (YS Sharmila) మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీల‌లో ఒక్క‌టి కూడా పూర్తిగా అమ‌లు కాలేద‌న్నారు. ఇక ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక విష‌యంలో త‌మ బండారాన్ని బ‌య‌ట పెట్టుకున్నార‌ని మండిప‌డ్డారు. ఒక తెలుగువాడు పోటీ చేస్తే త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా మోదీ ప‌రివారంలో ఎలా చెబితే అలా న‌డుచుకునే వ్య‌క్తికి ఓటు వేయ‌డం దారుణ‌మ‌న్నారు. ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కేంద్రానికి తాక‌ట్టు పెట్టార‌ని ఇంక ఏం మిగిలి ఉంద‌ని ఇవ్వ‌డానికి అంటూ ప్ర‌శ్నించారు.

YS Sharmila Slams AP Govt

ఇక రైతుల‌కు యూరియా దొర‌క‌క నానా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని వాపోయారు ష‌ర్మిలా రెడ్డి. కేంద్రం ఇచ్చే 6 వేలతో లింక్ పెట్ట‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. కేవలం 44 లక్షల మంది రైతులకు ఒక విడత 7 వేలు ఇచ్చి.. 30 లక్షల మంది రైతులకు పథకం దక్కకుండా పంగనామాలు పెట్టారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హామీల్లో సగానికి సగం కోత పెట్టడాన్ని సూపర్ హిట్ అంటారా అని ప్ర‌శ్నించారు. తల్లికి వందనం పథకం కింద 87 లక్షల మంది బిడ్డలు ఉంటే కేవలం 67 లక్షల మందికి 13 వేలు ఇచ్చి, 20 లక్షల మంది బిడ్డలకు పథకంలో కోత పెట్టారని ఆవేద‌న చెందారు ష‌ర్మిలా రెడ్డి.

మూడు సిలిండర్లు ఎంత మందికి ఇస్తున్నారో తెలియడం లేద‌న్నారు. గోరంత చేసి కొండంత చెప్పుకోవడం నిజంగా కూటమి ప్రభుత్వానికే చెల్లుతుందన్నారు.

Also Read : Nirmala Sitharaman Interesting Update : జీఎస్టీ మార్పులపై కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు

Exit mobile version