క్లైమోర్ మైన్లకు భయపడని బ్లడ్ మాది

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన నారా లోకేష్

hellotelugu-LokeshNara

అమ‌రావ‌తి : ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్బంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కార్యకర్తల పిల్లలను చదివించి వారికి ఉన్నత ఉద్యోగాలు వచ్చేలా చేశారని తెలిపారు. ఏ తప్పూ చేయని చంద్రబాబును 53 రోజుల్లో జైల్లో పెట్టారని ఆరోపించారు. క్లైమోర్ మైన్లకు భయపడని బ్లడ్ మాది… అక్రమ కేసులకు భయపడతామా..? అని అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు అద్భుతమైన విజయం అందించారు. ప్రజా ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంద‌ని చెప్పారు..ఏ రాష్ట్రంలో ఇవ్వనంత స్థాయిలో పెన్షన్లు ఇస్తున్నాం… తల్లికి వందనం ఇచ్చాం… అన్నదాత సుఖీభవ అందించాం… స్త్రీ శక్తిని ప్రవేశపెట్టాం అని అన్నారు నారా లోకేష్‌. కష్టపడిన కార్యకర్తలను గ్రామ స్థాయి నుంచి పొలిట్ బ్యూరో స్థాయికి తీసుకెళ్తాం.. అది నా బాధ్యత అని ప్ర‌క‌టించారు.

పార్టీ కోసం కృషి చేసిన వారిని గుర్తించి గౌరవిస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు పక్కన కూర్చొబెట్టాం. కష్టించిన వారిని గుర్తిస్తాం… గౌరవిస్తాం.. మై టీడీపీ యాప్ ద్వారా తాము చేసిన పనిని కార్యకర్తలు అప్డేట్ చేయాల‌ని కోరారు. మై టీడీపీ యాప్ లో సీబీఎన్ కనెక్ట్ అనే లింక్ ఉంది.. అభిప్రాయాలు ఏమైనా తెలపాలంటే ఆ యాప్‌ను వినియోగించు కోవాల‌ని సూచించారు. అహంకారం వద్దు ప్రజలతో మమేకం కావాలి.. ప్రజల సమస్యలు తెలుసుకోవాలి.. పరిష్కరించాలని స్ప‌ష్టం చేశారు . గతంలో అధికారంలో ఉన్న వారు అహంకారంతో ఉండడం వల్లే 151 సీట్ల నుంచి 11కు పడిపోయారని గుర్తు పెట్టుకోవాల‌న్నారు నారా లోకేష్‌.

Exit mobile version