సంగీత ద‌ర్శ‌కుడు న‌ల్లూరి సుధీర్ కుమార్ క‌న్నుమూత‌

టీవీ సీరియ‌ల్స్ కు సంగీతం అందించారు

hellotelugu-NalluriSudhirkumar

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు న‌ల్లూరి సుధీర్ కుమార్ గురువారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయ‌న వ‌ర్ధ‌మాన సంగీత ద‌ర్శ‌కుల‌లో ఒక‌డిగా పేరు పొందారు. ప్ర‌త్యేకించి సినిమా రంగానికి ధీటుగా బుల్లితెర సీరియ‌ల్స్ కు అద్భుత‌మైన సంగీతం అందించారు. ద‌శాబ్దాల పాటు అల‌రిస్తూ వ‌చ్చాడు. ల‌లిత సంగీత గాయ‌కుడిగా కూడా గుర్తింపు పొందారు న‌ల్లూరి సుధీర్ కుమార్. ఆయ‌న దూర‌ద‌ర్శ‌న్ లో వంద‌ల కొంద్ఇ పాట‌ల‌కు ప్రాణం పోశాడు. బ‌ర్క‌త్ పుర సిగ్న‌ల్స్ వ‌ద్ద ఉన్న రాఘ‌వేంద్ర అపార్ట్మెంట్ లో స‌ద‌ర్శ‌నం కోసం భౌతిక కాయాన్ని ఉంచారు. ఆయ‌న‌కు భార్య‌, ఇద్ద‌రు కూతుళ్లు ఉన్నారు.

న‌ల్లూరి సుధీర్ కుమార్ బుల్లితెర‌తో పాటు రేడియోలో కూడా త‌ను అందించిన పాట‌లు మంచి ఆద‌ర‌ణ పొందాయి. 1980 నుంచి 2000 సంవ‌త్స‌రం దాకా త‌ను టాప్ లో కొన‌సాగుతూ వ‌చ్చాడు. కెరీర్ ప‌రంగా టీవీ సీరియ‌ల్స్ తో పాటు కొన్ని సినిమాల‌కు కూడా సంగీతం అందించాడు. కూతురు మూవీకి గాను న‌ల్లూరి సుధీర్ కుమార్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. ప‌లు సినిమా పాట‌లు కూడా జ‌నం నోళ్ల‌ల్లో ఆడాయి. టీవీ సంగీత ద‌ర్శ‌కుడిగా న‌ల్లూరి సుధీర్ కుమార్ ఎన్నో అవార్డుల‌ను అందుకున్నాడు. అమ్మో అల్లుడా, కూతురు తో పాటు గ‌త 2024లో ఎస్ 99 చిత్రం కోసం ప‌ని చేశాడు. న‌ల్లూరి సుధీర్ కుమార్ మృతి ప‌ట్ల ప‌లువురు సినీ, బుల్లితెర సాంకేతిక నిపుణులు సంతాపం వ్య‌క్తం చేశారు.

Exit mobile version