చెన్నై : ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను సంగీతం అందిస్తున్న తాజా చిత్రం హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్. ఇందులో తాను రూపొందించిన పాట దేఖ్ లేంగే సాలా ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో టాప్ లో కొనసాగుతోంది. యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది ఈ పాట. ఈ సందర్భంగా స్పందించాడు సంగీత దర్శకుడు. తన తండ్రి సత్యమూర్తికి ఈ పాటను అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు. తన తండ్రి గొప్ప రైటర్. ఎన్నో సినిమాలకు కథలను కూర్చాడు. ఈ విషయాన్ని స్వయంగా డీఎస్పీ తన ఎక్స్ ఖాతా వేదికగా పంచుకున్నాడు. తన తండ్రిని తలుచుకుంటూ ఇలా రాశాడు.
జీవితం అంటే ఆత్మ విశ్వాసమే అని నాకు నేర్పిన వ్యక్తి నా తండ్రి సత్యమూర్తి. ఆయన ఇవాళ భౌతికంగా లేడు. కానీ ప్రతిక్షణం నాతోనే తను ఉంటాడని పేర్కొన్నాడు దేవిశ్రీ ప్రసాద్. దేఖ్ లెంగే సాలా పాటను అంకితం చేస్తున్నాను. ప్రియమైన నాన్న నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంతకు మించి నేను నిన్ను మిస్ అవుతున్నానని వాపోయాడు డీఎస్పీ. తలుచుకుంటే ఇప్పటికే నువ్వు మా నుండి దూరమై 10 ఏళ్లవుతుందని తలుచుకుంటే నమ్మలేక పోతున్నానని పేర్కొన్నాడు డీఎస్పీ. ఇదిలా ఉండగా ఈ పాటను తన తండ్రికి అంకితం ఇవ్వడం పట్ల సంతోషంగా ఉందన్నాడు దర్శకుడు హరీష్ శంకర్.
https://www.youtube.com/watch?v=hcNVG7JCxoE
