Murali Mohan : హైదరాబాద్ – జయ భేరి ఆర్ట్స్‌లో మేం తీసిన చిత్రాలన్నీ ఒకెత్తు కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన అతడు మరో ఎత్తు అన్నారు నటుడు, నిర్మాత మురళీ మోహన్. మహేష్ బాబు (Mahesh Babu), త్రిష కీలక పాత్ర పోషించిన ఈ మూవీ బిగ్ సక్సెస్ అయ్యింది. ఇప్పటికీ ఆ మూవీని ఆదరిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో విజయం సాధించిన మూవీస్ రీ రిలీజ్ అవుతున్నాయి. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9న రీ రిలీజ్ చేయబోతోన్నారు అతడు సినిమాను. ఈ క్రమంలో శనివారం రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు.
Murali Mohan Comments on Mahesh Babu
ఈ సందర్బంగా మురళీ మోహన్ (Murali Mohan) ప్రసంగించారు. మా బ్యానర్‌లో 2005 ఆగస్ట్ 10న అతడు సినిమాను రిలీజ్ చేశాం. ఇప్పుడు ఆగస్ట్ 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నాం. టెక్నాలజీ పరంగా అప్ గ్రేడ్ చేసి ఈ మూవీని మళ్లీ విడుదల చేస్తున్నాం. ఈ క్రమంలో మాకు ప్రసాద్ అండ్ టీం సహకరించింది. రైటర్‌గా త్రివిక్రమ్ మంచి సక్సెస్‌లో ఉన్నప్పుడు మా బ్యానర్‌లో దర్శకుడిగా పరిచయం చేసి, ఆయనతో మొదటి సినిమా చేయాలని అనుకున్నాం అన్నారు. ఆ టైంలో కథ చెప్పమని ఆయన్ను పిలిపించాం. స్రవంతి కిషోర్ కి మాటిచ్చాను.. వారి బ్యానర్‌లో సినిమా చేసిన తరువాత మీ వద్దకు వస్తానని త్రివిక్రమ్ అన్నారు. ఆ తరువాత మా వద్దకు వచ్చి మూడు గంటల పాటుగా ఈ ‘అతడు’ కథను కళ్లకు కట్టినట్టుగా చెప్పారని తెలిపారు.
హీరో అంటే సుగుణాభిరాముడు అని అంతా అనుకునేలా పాత చిత్రాలు వస్తుండేవి. కానీ ఇందులో హీరో పాత్ర కాస్త నెగెటివ్ ధోరణిలో ఉంది కదా? అని అంటే.. ఇప్పుడు అదే ట్రెండ్ అని త్రివిక్రమ్ అన్నారు. సరే అని అంతా ఆయన మీదే భారం వేశాం. ఓ ఇంటి సెట్‌ను వేస్తే అందరూ అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. దాదాపు 90 శాతం సీన్లు అదే సెట్‌లో షూటింగ్ చేశాం. ఆ తరువాత ఆ సెట్‌ను చాలా మంది వాడుకున్నారు. అయితే ఆ తరువాతి కాలంలో ఓఆర్ఆర్ రావడంతో ఆ సెట్ వెళ్లిపోయింది. లేదంటే అక్కడే ఓ స్టూడియో కూడా కట్టేవాళ్లం అన్నాడు మురళీ మోహన్. ‘అతడు’ మూవీ కోసం మహేష్ బాబు (Mahesh Babu) చాలా సహకరించారు. ఎంత ఆలస్యమైనా సరే, ఎన్ని డేట్లు అయినా సరే ఇచ్చారు. క్లైమాక్స్ ఫైట్ కోసం చాలా కష్టపడ్డారు. సినిమాకు చాలా మంచి పేరు వచ్చింది. బుల్లితెరపై ‘అతడు’ కొత్త చరిత్రను సృష్టించింది. ఈ చిత్రం మా సంస్థకు మంచి గౌరవాన్ని తీసుకు వచ్చిందన్నారు.
నా సోదరుడు కిషోర్ తనయ ప్రియాంక ఈ మూవీని టెక్నికల్‌గా అప్ గ్రేడ్ చేసి అందరి ముందుకు తీసుకు వస్తున్నారు. ఇక ముందు ప్రియాంక ఆధ్వర్యంలో జయ భేరి ఆర్ట్స్ నుంచి సినిమాలు వస్తూనే ఉంటాయి. రీ రిలీజ్ కోసం గత కొన్నేళ్ల నుంచి అందరూ నన్ను సంప్రదిస్తూ ఉన్నారు. జితేంద్ర వచ్చి అడిగిన తరువాత కాదనలేక పోయాను. ‘అతడు’ రీ రిలీజ్ బ్లాక్ బస్టర్ అవుతుందని కచ్చితంగా నమ్ముతున్నాను అన్నారు. ప్రసాద్ ఐమాక్స్ బిగ్ స్క్రీన్ మీదకు సినిమాను తీసుకు రావడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నాం. ‘అతడు’ సినిమాలోని ప్రతీ డైలాగ్‌ను జనాలు ఇప్పటికీ వాడుకుంటూనే ఉంటారు. సెన్సార్ వాళ్లు ‘అతడు’ మూవీని చూసి ఇంగ్లీష్ సినిమాలా ఉందని అన్నారు. థియేట్రికల్ పరంగా మేం అనుకున్నంత రేంజ్‌లో ఆడలేదు. కానీ బుల్లితెరపై మాత్రం రికార్డులు క్రియేట్ చేసింది. ఈ మూవీ కోసం వేసిన సెట్‌ను ఇతర ప్రొడక్షన్ కంపెనీలు కూడా వాడుకున్నాయి. వాటి ద్వారా కూడా చాలా డబ్బులు వచ్చాయి. కమర్షియల్‌గా ‘అతడు’ పట్ల మేం సంతృప్తిగానే ఉన్నాం.
Also Read : MLC Deshapati Shocking Comments : బాబు శాసిస్తాడు బానిస పాటిస్తాడు : దేశిపతి
