జానీ మాస్టర్‌పై ఫెడరేషన్ బహిష్కరణ ముప్పు..?

ముదురుతున్న నృత్య‌కారుల సంఘం వివాదం

hellotelugu-JaniMaster

హైద‌రాబాద్ : రోజు రోజుకు నృత్యకారుల సంఘం వివాదం ముదురుతోంది. జానీ మాస్టర్‌పై ఫెడరేషన్ బహిష్కరణ ముప్పు పొంచి ఉంది. జానీ పేరు, డబ్బు సంపాదించారు, కానీ ఆయన అహంకారంతో ప్రవర్తిస్తున్నారంటూ అని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఫెడరేషన్ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం , నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో, త‌న‌తో పాటు త‌న‌ భార్య తెలుగు ఫిల్మ్ , టీవీ డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత పై కూడా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్‌కు మారినప్పుడు ఫెడరేషన్ నృత్యకారులకు అండగా నిలిచింది. మా హయాంలో, పాటల చిత్రీకరణలో ఎక్కువ మంది తెలుగు నృత్యకారులకు ఉపాధి లభించేలా చూశామని పేర్కొన్నారు.

తమిళ కొరియోగ్రాఫర్లు 100 మంది నృత్యకారులతో తెలుగు సినిమాలకు పని చేసినప్పుడు కూడా, వారిలో సుమారు 70 మంది స్థానిక నృత్యకారులు ఉండేలా, కేవలం 30 మంది మాత్రమే చెన్నై నుండి వచ్చేలా తాము చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు. 600 మందికి పైగా నృత్యకారులకు ప్రయోజనం చేకూర్చేలా వేతనాల పెంపు కోసం ఫెడరేషన్ విజయవంతంగా పోరాడిందన్న విష‌యాన్ని గుర్తు చేశారు. ఫెడరేషన్ మద్దతు లేకుండా ఇవేవీ సాధ్యమయ్యేవి కావు అని ఆయన వివరించారు. ఈ సమాఖ్య ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా , ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ అనుసంధానించబడి ఉందని ఆయన గుర్తు చేశారు.

కొంతమంది కొరియోగ్రాఫర్లు తమను తాము హీరోలుగా భావిస్తున్నారు. ఇది విజయం సాధించిన తర్వాత సొంత తల్లిదండ్రులను కాదనుకోవడం లాంటిది. జానీ ఫెడరేషన్‌ను అగౌరవ పరుస్తున్నారు, ఇది ఆమోదయోగ్యం కాదు అని పేర్కొన్నారు రాజేశ్వ‌ర్ రెడ్డి.

Exit mobile version