MLC Deshapati Shocking Comments : బాబు శాసిస్తాడు బానిస పాటిస్తాడు : దేశిప‌తి

నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ

Hello Telugu - MLC Deshapati Shocking Comments

MLC Deshapati : హైద‌రాబాద్ – జై తెలంగాణ నినాదంపై రాష్ట్రంలో ప్ర‌స్తుతం అప్ర‌క‌టిత నిషేధం కొన‌సాగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశిప‌తి శ్రీ‌నివాస్. శ‌నివారం ఉప్ప‌ల్ లో జ‌రిగిన బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సదస్సులో పాల్గొని ప్ర‌సంగించారు. ఎందుకు రేవంత్ రెడ్డికి ఇంకా బానిసత్వం అంటూ ప్ర‌శ్నించారు. కేసీఆర్ హయంలో జై తెలంగాణ నినాదం సచివాలయం సహా అంతటా మారుమోగేదన్నారు. రేవంత్ జై తెలంగాణ అనరు కనుక మంత్రులు, అధికారులు కూడా జై తెలంగాణ అనడం లేద‌న్నారు.

MLC Deshapati Slams CM Revanth Reddy

ఈ గడ్డ మీద ఉంటూ జై తెలంగాణ అనక పోవడం ఏమిటి అంటూ ప్ర‌శ్నించారు దేశిప‌తి శ్రీ‌నివాస్ (MLC Desipathi). ఉద్యమంలో తెలంగాణకు ద్రోహం చేశానని రేవంత్‌కు ఇపుడు జై తెలంగాణ అనడానికి భయమా అని అన్నారు. సినీ స్టార్స్ కూడా జై తెలంగాణ అంటున్నారని, మనకు జై తెలంగాణ అంటే ఓ ఎనర్జీ అని, కానీ రేవంత్‌కు ఎలెర్జీ పుట్టుకు వ‌స్తుంద‌న్నారు. అప్పుడైనా, ఇప్పుడైనా తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీయేనంటూ ఆరోపించారు. తెలంగాణ చరిత్ర పట్ల రేవంత్‌కు ద్వేషం ఉందన్నారు. అమర వీరులకు నివాళులర్పించని సీఎం రేవంత్ రెడ్డి ఒక్క‌డేన‌ని అన్నారు.

చంద్రబాబు విజయవాడకు పోయిండు.రేవంత్ చంచల్‌గూడ జైలుకు పోయిండు. అందుకే రేవంత్ జై తెలంగాణ అనడు అన్నారు. అమరావతిలో ఉన్న బాబు శాసిస్తాడు. ఇక్కడ ఉన్న బానిస పాటిస్తాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. బనకచర్లపై అదే జరుగుతోందని, తెలంగాణ ఇప్పుడు సామంత రాజ్యంగా మారిందన్నారు. రేవంత్ చంద్రబాబు సామంతుడుగా మారారని మండిప‌డ్డారు. తెలంగాణ తేవడమే కాదు.టీడీపీని తెలంగాణలో కూకటి వేళ్ళతో పెకిలించి కేసీఆర్ ఎవరూ చేయని పనిచేశారని అన్నారు. ఆ కోపంతో చంద్రబాబు రేవంత్ రూపంలో తెలంగాణపై కక్ష తీర్చుకుంటున్నారని ఆవేద‌న చెందారు.

Also Read : Chirag Paswan Shocking Comments : బీహార్ సీఎం కు మద్దతిచ్చినందుకు బాధపడుతున్న

Exit mobile version