Rahul Gandhi : న్యూఢిల్లీ : ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిప్పులు చెరిగారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకున్నారు. శనివారం మీడియాతో మాట్లాడారు. న్యూఢిల్లీలో అఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి విలేకరుల సమావేశంలో మహిళా జర్నలిస్టులు లేక పోవడంపై అభ్యంతరం చెప్పనందుకు ప్రధానమంత్రిని ఉద్దేశించి తీవ్రంగా తప్పు పట్టారు. ఇది మహిళల హక్కులపై బలహీనత, కపటత్వానికి సంకేతం అని ఆరోపించారు. బహిరంగ వేదిక నుండి మహిళా జర్నలిస్టులను మినహాయించడం దారుణమన్నారు. ఇదేనా మీడియాకు ఉన్న స్వేచ్ఛ అని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు రాహుల్ గాంధీ.
Rahul Gandhi Slams PM Modi
ప్రధానమంత్రి భారతదేశంలోని ప్రతి మహిళకు తాను వారి కోసం నిలబడటానికి చాలా బలహీనుడినని చెప్పకనే చెప్పారంటూ ఎద్దేవా చేశారు. మీరు మహిళా జర్నలిస్టులను బహిరంగ వేదిక నుండి మినహాయించడానికి అనుమతించినప్పుడు, భారతదేశంలోని ప్రతి మహిళకు మీరు వారి కోసం నిలబడటానికి చాలా బలహీనంగా ఉన్నారని గ్రహించాలని హితవు పలికారు. ఆఫ్గాన్ విదేశాంగ శాఖ మంత్రితో జరిగిన ప్రెస్ మీట్ లో కొందరు మాత్రమే ఉండడాన్ని తప్పు పట్టారు. మిగతా మీడియా ప్రొఫెషనల్స్ ను ఎందుకు ఆహ్వానించ లేదంటూ ప్రశ్నించారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో విస్తృత చర్చలు జరిపిన కొన్ని గంటల తర్వాత ముత్తాకి న్యూఢిల్లీలోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయంలో ఈ సంభాషణ నిర్వహించారు.
కాగా కాబూల్‌లోని తాలిబన్ పాలన ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల హక్కులను పరిమితం చేసినందుకు వివిధ దేశాల నుండి అలాగే ఐక్యరాజ్యసమితి వంటి ప్రపంచ సంస్థల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.
Also Read : Deputy CM Pawan Important Challenge : ఉప్పాడ తీర ప్రాంతంలో కాలుష్యంపై సమీక్ష
