Deputy CM Pawan Important Challenge : ఉప్పాడ తీర ప్రాంతంలో కాలుష్యంపై స‌మీక్ష‌

చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

Hello Telugu - Deputy CM Pawan Important Challenge

Hello Telugu - Deputy CM Pawan Important Challenge

Deputy CM Pawan : అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Deputy CM Pawan) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉప్పాడ తీరం ప్రాంతంలో కాలుష్యం చోటు చేసుకోవ‌డం ప‌ట్ల ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. శ‌నివారం త‌న కార్యాల‌యంలో స‌మీక్ష చేప‌ట్టారు. కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి ప‌నితీరు ప‌ట్ల కూడా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. సాక్షాత్తు శాస‌న స‌భ‌లో కూట‌మిలో కీల‌క పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్ర‌స్తావించ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇవాళ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కూలంకషంగా చ‌ర్చించారు డిప్యూటీ సీఎం.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో పాల్గొన్నారు కాకినాడ జిల్లా యంత్రాంగం. పొల్యూషన్ ఆడిట్ కి అనుసరించాల్సిన విధి విధానాలపై కూడా చ‌ర్చించారు. కాకినాడ జిల్లాతో పాటు గోదావరి జిల్లాలలో ఉన్న కాలుష్య పరిస్థితులు, పర్యావరణ పరిరక్షణపై హైలెట్ చేశారు డిప్యూటీ సీఎం.

Deputy CM Pawan Kalyan Comments

ఉప్పాడ తీరం ప్రాంతంలో కాలుష్య నియంత్రణ అంశాలపై ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. కాకినాడ జిల్లాలో ఉన్న పారిశ్రామిక కాలుష్యం, మైనింగ్ మూలంగా తలెత్తుతున్న కాలుష్య ఇబ్బందులపై చర్చించారు. దీనిపై ఫుల్ ఫోక‌స్ పెట్టాల‌ని ఆదేశించారు. ప్రధానంగా తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పిఠాపురం నియోజక వర్గం పరిధిలో తీర ప్రాంత కాలుష్యం గురించి ప్ర‌స్తావించారు. తాను ఇటీవ‌ల‌ కాకినాడలో చేపట్టిన మత్స్యకారులతో మాట మంతి కార్య‌క్రమం చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా మత్స్యకారులు ప్రస్తావించిన అంశాలు, వారు వెలిబుచ్చిన సందేహాలపై పీసీబీ నుంచి వివరాలు తీసుకొన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌.

Also Read : Ex MP Anjani Kumar Interesting Comments : జూబ్లీహిల్స్ లో బ‌రాబ‌ర్ నిల‌బ‌డ‌తా

Exit mobile version