జైలులో ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ ఫోన్ వినియోగం

రెండు రోజుల పోలీస్ క‌స్ట‌డీకి ఆదేశం

helloteluggu-PrajwalRevann

బెంగ‌ళూరు : మాజీ ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ మ‌రోసారి సంచ‌ల‌నంగా మారారు. ఆయ‌న ప్ర‌స్తుతం జైలులో ఉన్నారు. త‌ను ఎవ‌రో కాదు మాజీ ప్ర‌ధాన‌మంత్రి దేవెగౌడ కు మ‌నుమ‌డు. ప్ర‌స్తుతం ఆయ‌న జైలులో ఉంటూనే నిబంధ‌న‌లు ఉల్లంఘించారు. ఆపై మొబైల్ ఫోన్ ను వినియోగించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. దీంతో ప్రజ్వల్ రేవణ్ణకు 2 రోజుల పోలీస్ కస్టడీ విధించింది కోర్టు . రేవణ్ణను, సహ నిందితుడు ప్రతాప్ రాయ్‌తో పాటు 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో మొబైల్ ఫోన్ వాడారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.

జైలులో మొబైల్ ఫోన్ వాడారన్న ఆరోపణలకు సంబంధించి మాజీ జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను స్థానిక కోర్టు రెండు రోజుల పోలీస్ కస్టడీకి పంపింది. జైలులో మొబైల్ ఫోన్ వాడారన్న ఆరోపణల తర్వాత, రేవణ్ణ సహ నిందితుడు ప్రతాప్ రాయ్‌లను 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. జైలులో ఫోన్ వాడకంపై తదుపరి విచారణ నిమిత్తం కోర్టు రేవణ్ణ , రాయ్‌లను రెండు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. అత్యాచార కేసులో శిక్ష అనుభవిస్తున్న రేవణ్ణ ప్రస్తుతం పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఇటీవల జైలులో నిర్వహించిన తనిఖీల్లో ఈ మొబైల్ ఫోన్ వాడకం విషయం వెలుగులోకి వచ్చింది. దీనితో అత్యంత భద్రత కలిగిన ఈ జైలులో ఆ పరికరం ఎలా అందుబాటులోకి వచ్చిందనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు.

Exit mobile version