MP Owaisi Strong Focus : బీహార్ ఎన్నిక‌ల్లో ఎంఐఎం ప్ర‌చారం : ఓవైసీ

సీమాంచ‌ల్ నుంచి ఎన్నిక‌ల క్యాంపెయిన్

Hello Telugu - MP Owaisi Strong Focus

Hello Telugu - MP Owaisi Strong Focus

Owaisi : హైద‌రాబాద్ : ఎంఐఎం చీఫ్ , హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ (Owaisi) ఫుల్ ఫోక‌స్ పెట్టారు త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే బీహార్ శాస‌న స‌భ ఎన్నిక‌ల‌పై. ఇప్ప‌టికే త‌న పార్టీని దేశ వ్యాప్తంగా విస్త‌రించేందుకు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించారు. అందుకు అనుగుణంగానే ఆయ‌న పావులు క‌దుపుతున్నారు. ఈ దేశంలో బ‌ల‌మైన ముస్లిం సామాజిక వ‌ర్గానికి త‌మ పార్టీ ప్ర‌తినిధిగా ఉంద‌నే విష‌యాన్ని జ‌నంలోకి తీసుకు వెళ్ల‌డంలో స‌క్సెస్ అయ్యారు అస‌దుద్దీన్ ఓవైసీ. ఇక వ‌చ్చే ఏడాది బీహార్ లో శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టి నుంచే ప్ర‌ధాన పార్టీల‌న్నీ ఎన్నిక‌ల ప్ర‌చారంపై ఫోక‌స్ పెట్టాయి. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు , ఎంపీ రాహుల్ గాంధీ, తేజ‌స్వీ యాద‌వ్ తో క‌లిసి ఎన్నిక‌ల యాత్ర కు శ్రీ‌కారం చుట్టారు. మ‌రో వైపు బీజేపీ, నితీష్ కుమార్ క‌లిసి ప్ర‌స్తుతం ప్ర‌భుత్వంలో ఉన్నారు. ఇంకో వైపు జ‌న్ సుర‌క్ష్ అనే పేరుతో ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ పార్టీని స్థాపించారు. ఆయ‌న అన్ని పార్టీల కంటే ముందు నుంచే జ‌నంలోకి చేరుకున్నారు. విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తున్నారు.

MP Asaduddin Owaisi Focus

తాజాగా ఓవైసీ సైతం సీమాంచ‌ల్ నుండి బీహార్ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించ‌నున్నారు. పొత్తుల రాజకీయాలపై దృష్టి సారించారు. రాష్ట్రంలోని తన మద్దతుదారులు, కార్మికులను ప్రచారంలో చురుకుగా పాల్గొనాలని ఎంఐఎం కోరింది. ఇందులో భాగంగానే ఇవాల్టి నుంచే దానికి శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. సీమాంచల్ ప్రాంతంలోని కిషన్‌గంజ్ నుండి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఓవైసీ. ఐదు రోజుల పాటు ఈ యాత్ర కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈనెల 27వ తేదీ వ‌ర‌కు తాను అక్క‌డే ఉంటాన‌ని వెల్ల‌డించారు ఓవైసీ. ఇదిలా ఉండ‌గా ఎంఐఎం రాష్ట్ర చీఫ్ అఖ్త‌రుల్ ఇమాన్ ఓవైసీ ఆదేశం మేర‌కు రాబోయే ఎన్నిక‌ల్లో ఎన్డీఏకి వ్య‌తిరేకంగా క‌లిసి రావాల‌ని కోరుతూ ఇండియా బ్లాక్ నేత‌ల‌కు లేఖ రాశారు. ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన ఆర్జేడీ నుంచి స్పంద‌న రాలేదు.

Also Read : BRS Bathukamma Festival Interesting : రేపే బీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో బ‌తుక‌మ్మ సంబురాలు

Exit mobile version