Bathukamma : హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన చరిత్ర బతుకమ్మది (Bathukamma). సాంస్కృతిక చిహ్నంగా నేటికీ కొనసాగుతోంది. కోట్లాది మంది మహిళలను ఒక చోటుకు చేర్చింది. పోరాటానికి ఊపిరి పోసింది. వేలాది మందిని భాగం పంచుకునేలా చేసింది. ఈ సందర్బంగా తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 24న ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో ఉన్న పీపుల్స్ ప్లాజాలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది.
BRS Bathukamma Festival Tomorrow
ఈ బతుకమ్మ సంబరాలకు హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు, పార్టీ కార్యకర్తలు తరలి వస్తారని బీఆర్ఎస్ నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ బతుకమ్మ సంబరాల నిర్వహణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, నగర ఎమ్మెల్యేలు, పార్టీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు హాజరయ్యారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. పీపుల్స్ ప్లాజాలో జరిగే ఈ కార్యక్రమానికి భారీగా మహిళలను తరలించేందుకు కృషి చేయాలని, ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న గత పది సంవత్సరాలపాటు బతుకమ్మ సంబరాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా పార్టీ నాయకులు గుర్తు చేసుకున్నారు.
Also Read : Hydraa Chief Ranganath Shocking Comments : రూ. 50 వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం
