MP Mahua Moitra Fired on Amit Shah : అమిత్ షా పై భ‌గ్గుమ‌న్న మ‌హూవా మొయ‌త్రా

ముమ్మాటికీ ఢిల్లీ ఘ‌ట‌న కేంద్ర స‌ర్కార్ వైఫ‌ల్యమే

Hello Telugu - MP Mahua Moitra Fired on Amit Shah

Hello Telugu - MP Mahua Moitra Fired on Amit Shah

Mahua Moitra : ఢిల్లీ : ఢిల్లీ కారు పేలుడు ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌కలం రేపింది. ఎనిమిది మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 20 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ సంద‌ర్బంగా ఈ ఘ‌ట‌న‌పై తీవ్రంగా స్పందించారు తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ మ‌హూవా మొయిత్రా (Mahua Moitra). కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై మండిప‌డ్డారు. మంగ‌ళ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. ముమ్మాటికీ మంత్రి, కేంద్ర స‌ర్కార్, నిఘా వైఫ‌ల్య‌మేన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రాణాలు పోయాక తెచ్చి ఇస్తారా అని ప్ర‌శ్నించారు ఎంపీ. సరిహద్దులు , నగరాలను కాపాడటంలో హోంమంత్రి వైఫల్యం క‌నిపిస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన అధిక తీవ్రత గల పేలుడు తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా జాతీయ భద్రతలో విఫలమయ్యారని టిఎంసి నాయకురాలు ఆరోపించారు.

MP Mahua Moitra Slams Amit Shah

భారతదేశానికి పూర్తి సమయం నిరంత‌రం విషం చిమ్ముతూ, ద్వేషాన్ని ప్ర‌చారం చేసే కేంద్ర మంత్రి కాద‌న్నారు. కావాల్సింది సమర్థవంతమైన హోంమంత్రి అవసరం అని స్ప‌ష్టం చేశారు. మన సరిహద్దులను అలాగే మన నగరాలను రక్షించడం త‌న విధి కాదా అని నిల‌దీశారు మ‌హూవా మొయిత్రా. ప్ర‌తీసారి విఫ‌లం అవుతూనే ఉన్నా ఎందుకు ఇంకా కేబినెట్ లో కొన‌సాగుతున్నాడో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌న్నారు. ఇంత జ‌రుగుతున్నా ఏం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు మొయిత్రా. పోలీసింగ్ , నిఘా అంతరాలపై ప్రశ్నలు లేవ‌నెత్తారు. శాంతిభద్రతలు, సమాఖ్యవాదం, ప్రతిపక్ష నాయకులపై కేంద్రం ఏజెన్సీలను ఉపయోగించడం వంటి అంశాలపై కృష్ణానగర్ ఎంపీ తరచుగా బిజెపి నాయకత్వాన్ని లక్ష్యంగా చేశారు.

Also Read : Gautam Gambhir Shocking Comments : టి20 ఓపెనింగ్ పై గంభీర్ షాకింగ్ కామెంట్స్

Exit mobile version