చెన్నై : తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ పై తీవ్ర ఆరోపణలు చేసింది ప్రముఖ హిందూ సంస్థ విశ్వ హిందూ పరిషత్ (వి హెచ్ పి). సీఎంను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. సీఎం హిందూ వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించింది. తను ఇలాంటి చర్యలు మానుకోవాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది . తిరుప్పరంకుండ్రం మహా దీపం వివాదంపై విజయ్ ప్రభుత్వాన్ని తప్పు పట్టింది.ఇది మంచి పద్దతి కాదని పేర్కొంది. కోట్లాది మంది మనోభావాలతో కూడుకున్న అంశం అని పేర్కొంది.
తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపోత్సవం సందర్భంగా మహాదీపం వెలిగించకుండా అడ్డుకోవడంపై తమిళనాడు TVK ప్రభుత్వంపై విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడం హిందూ విశ్వాసాలను, న్యాయవ్యవస్థను, భారత రాజ్యాంగాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై సుప్రీంకోర్టు కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు .తమిళనాడులోనూ హిందూ వ్యతిరేక రాజకీయాలకు త్వరలోనే చరమగీతం పాడతారని జోష్యం చెప్పారు.
ఇప్పటికే జరిగిన తప్పిదాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నం చేయాలని సిఎం విజయ్ కు సూచించారు. ఇదిలా ఉండగా ఊహించని రీతిలో సీఎం విజయ్ కు షాక్ తగిలింది. ఆయనకు దీపం వెలిగించక పోవడానికి గల కారణాలను తెలియ చేయాలని కోరుతూ ఏపీకి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి న్యాయవాది ద్వారా విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్ కు లీగల్ నోటీసులు పంపించారు.
