Gautam Gambhir Shocking Comments : టి20 ఓపెనింగ్ పై గంభీర్ షాకింగ్ కామెంట్స్

సంజూ శాంస‌న్ ప్లేస్ మార్చ‌డంపై స్పంద‌న

Hello Telugu - Gautam Gambhir Shocking Comments

Hello Telugu - Gautam Gambhir Shocking Comments

Gautam Gambhir : ముంబై : భార‌త క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆస్ట్రేలియా టూర్ లో భాగంగా టీమిండియా టి20 ఫార్మాట్ కు సంబంధించి కీల‌క మార్పులు చేయ‌డం, ప్ర‌ధానంగా స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ ను మార్చ‌డం ప‌ట్ల పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం గౌత‌మ్ గంభీర్ (Gautam Gambhir) స్పందించారు. ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఆయ‌న పంచుకున్నారు. జ‌ట్టు ముఖ్య‌మ‌ని, వ్య‌క్తులు ప్ర‌ధానంగా కాద‌న్నారు. తాను ఎవ‌రి గురించి ఆలోచించ బోన‌ని పేర్కొన్నారు. ఎలా గెల‌వాల‌న్న దానిపై ఫోక‌స్ పెడ‌తామ‌న్నారు. అప్ప‌టిక‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకోవ‌ల్సి ఉంటుంద‌న్నారు. త‌న‌ను టార్గెట్ చేయ‌డాన్ని కూడా ఆయ‌న ఒప్పుకున్నారు. ఇవ‌న్నీ స‌హ‌జ‌మేన‌ని పేర్కొన్నారు.

Gautam Gambhir Comments

ఎవ‌రైతే శాంస‌న్ ను ప‌క్క‌న పెడుతున్నార‌ని గ‌గ్గోలు పెడుతున్నారో వారికి గ‌ట్టిగా స‌మాధానం చెప్పాల‌ని అనుకుంటున్నా. ఎందుకంటే త‌న‌ను ఓపెన‌ర్ గా ప్ర‌మోట్ చేసింది తానేన‌ని ఆ విష‌యం మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు గౌతం గంభీర్. నా అభిప్రాయం ప్రకారం బ్యాటింగ్ ఆర్డర్లు చాలా అతిగా అంచనా వేయబడ్డాయని పేర్కొన్నారు, ఓపెనర్లు తప్ప ఇద్దరు ఓపెనర్లు శాశ్వతంగా ఉంటారని అన్నాడు. మిగిలినవి అన్నీ మారుతాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే T20I క్రికెట్‌లో ముఖ్యమైనవి పరుగులు చేయ‌డ‌మే కాద‌ని , స‌గ‌టు ర‌న్స్ చేస్తున్నారా లేదా స్ట్రైక్ రేట్ గురించి ఆలోచిస్తామ‌ని చెప్పాడు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును ఎలా ప్ర‌భావితం చేయ‌గ‌ల‌ర‌నే దానిపై ఆలోచిస్తాన‌ని చెప్పాడు హెడ్ కోచ్.

Also Read : Supreme Court Shocking Update : పోర్న్ నిషేధిస్తే నేపాల్ మాదిరి ఉద్యమం రావచ్చు

Exit mobile version