MP Kesineni Sivanath : విజయవాడ : నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో ప్రారంభమైంది. ఈ షోను ప్రతి ఒక్కరు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు బెజవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (MP Kesineni Sivanath). నగరంలోని ఎ – కన్వెన్షన్ సెంటర్ లో నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. ఈ ప్రాపర్టీ షో మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఈనెల 21వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రాపర్టీ షోను నగరవాసులు సందర్శించాలని కోరారు. ప్రాపర్టీ షోను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంబించారు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు.
MP Kesineni Sivanath Key Comments
సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు ప్రాపర్టీ షో ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు ఎంపీ.
అమరావతి నగరం భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో ప్రాపర్టీ షోలో ప్రదర్శించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇండియాలోనే అమరావతి అందమైన నగరంగా రూపు దిద్దుకోబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతంలో పెట్టుబడి పెడితే మంచి భవిష్యత్ ఉంటుందని స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ రంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇప్పటికే నాలా చట్టంలో బిల్డర్స్ కి వెసులుబాటు కల్పించడం జరిగిందని చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగం ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు.
జిడిపి లో రియల్ ఎస్టేట్ ప్రముఖ పాత్ర పోషిస్తోందని చెప్పారు ఎంపీ కేశినేని శివనాథ్. రియల్ ఎస్టేట్ రంగంలో ఏదైనా సమస్య ఉంటే తాను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సొంత ఇంటి కల సాకారం చేసుకోవాలి అనే వారికి ప్రాపర్టీ షో మంచి అవకాశం అన్నారు.
Also Read : Minister Atchannaidu – Urea Import Growth : ఏపీకి 13,050 మెట్రిక్ టన్నుల యూరియా
