Minister Atchannaidu – Urea Import Growth : ఏపీకి 13,050 మెట్రిక్ ట‌న్నుల యూరియా

వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి అచ్చెన్నాయుడు

Hello Telugu - Minister Atchannaidu - Urea Import Growth

Hello Telugu - Minister Atchannaidu - Urea Import Growth

Minister Atchannaidu : అమరావతి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎలాంటి యూరియా కొర‌త లేద‌ని స్ప‌ష్టం చేశారు వ్యవ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. రైతుల‌కు స‌రిపడా యూరియా స‌మృద్దిగా గోదాముల‌లో ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. వైసీపీ నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఎప్ప‌టిక‌ప్ప‌డు కేంద్ర స‌ర్కార్ తో ట‌చ్ లో ఉన్నార‌ని, ఈ మేర‌కు ఇప్ప‌టికే కేంద్రం సానుకూలంగా స్పందించింద‌ని చెప్పారు. రైతుల‌కు ఇబ్బందులు లేకుండా చర్య‌లు తీసుకుంటున్నామ‌ని, యూరియా పంపిణీకి ప్ర‌త్యేకంగా క‌మిటీలు కూడా ఏర్పాటు చేశామ‌ని చెప్పారు మంత్రి. ఇదిలా ఉండ‌గా ఏపీకి 13,050 మెట్రిక్ ట‌న్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్రం ఉత్త‌ర్వులు జారీ చేసింద‌ని అచ్చెన్నాయుడు వెల్ల‌డించారు.

Minister Atchannaidu Key Comments on Urea

ఈ నెల 20వ తేదీకి గంగవరం పోర్ట్ కు యూరియా రాష్ట్రానికి చేరుతుందని అన్నారు. ఈ కేటాయింపుతో రైతులకు మ‌రింత‌ వెసులుబాటు లభిస్తుందని చెప‌ప్పారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని, రాష్ట్రంలో ఇప్పటికే సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. రైతుల భవిష్యత్తు కోసం కూటమి దృఢంగా నిలబడి ఉందని, ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక‌ ప్రాధాన్యత ఇస్తుంద‌న్నారు. ప్రతి రైతు అవసరాలను, సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సమగ్ర దృష్టితో ముందుకొస్తుందని, రైతుల ఆదాయాన్ని పెంచడం, పంట‌ల‌కు సరైన మార్కెటింగ్‌ను అందించడం కూటమి లక్ష్యమ‌ని తెలిపారు. సీఎం చంద్ర‌బాబు చొర‌వ‌తోనే ఇత‌ర రాష్ట్రాల క‌న్నా అధిక మొత్తంలో రాష్ట్రానికి యూరియాను కేంద్రం కేటాయిస్తుంద‌ని మంత్రి అచ్చెన్న తెలిపారు.

Also Read : RBI Shocking Rent Payments : ఫోన్ పే, గూగుల్ పే, ఇతర యాప్స్ రెంట్ ప్రెమెంట్స్ కి కొత్త రూల్స్

Exit mobile version