MP Harish Balayogi Alarming : కోనసీమలో కొబ్బరి ఉత్పత్తి సంస్థలు నెలకొల్పండి

పార్లమెంట్ లో కోరిన ఎంపీ హరీష్ బాలయోగి

Hello Telugu - MP Harish Balayogi Alarming

Hello Telugu - MP Harish Balayogi Alarming

Harish Balayogi: ఢిల్లీ – డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతులకు మేలు చేసేందుకు జిల్లాలో కొబ్బరి ఉత్పత్తి సంస్థలు నెలకొల్పాలని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి (Harish Balayogi) కోరారు. నియమం 377 ప్రకారం పార్లమెంట్ లో సభాపతికి విన్న‌వించారు. ఆంధ్రప్రదేశ్ లో అనేక జిల్లాల్లో ముఖ్యంగా కోనసీమలో కొబ్బరి సాగు గ్రామీణ ప్రజలకు జీవనోపాధికి వెన్నెముక లాగా మారింద‌న్నారు. .ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కొబ్బరి ఉత్పత్తిలో దాదాపు సగం వాటా కోనసీమదేనని స్ప‌ష్టం చేశారు ఎంపీ. అనేక జిల్లాల్లో గణనీయ స్థాయిలో ఉత్పత్తి ఉన్నప్పటికీ రైతులు తమ ఉత్పత్తులను పూర్తి విలువను పొందడానికి స్థానికంగా అవసరమైన మద్దతు లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Harish Balayogi Comments

కొబ్బ‌రి ఉత్ప‌త్తి అభివృద్ధి బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటైన కొబ్బరి ఉత్పత్తిదారుల సంఘాలు(CPS), సమాఖ్యలు(CPF), కంపెనీలు (CPC),సామూహిక మార్కెటింగ్, వ్యయ సామర్థ్యం, ఉత్పత్తి విలువను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. గత అయిదు సంవత్సరాలలో కేవలం సీపీఎస్ లు మాత్రమే నమోదు చేయబడ్డాయని ప్రస్తుతం వాటిలో ఒక్కటి కూడా పనిచేయడం లేదన్నారు. 2019 నుండి ఒక్క సీపీఎఫ్,సీపీసీ కూడా ఏర్పాటు చేయలేదని చెప్పారు. అందువ‌ల్ల‌ కొబ్బరి రైతులు పూర్తి స్థాయిలో ఆదాయం పొందలేక పోతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఎంపీ.

ఆంధ్రప్రదేశ్ లోని కొబ్బరిచెట్ల పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న వేల మంది డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి అభివృద్ధి బోర్డు సంస్థలను ఏర్పాటు చేసి విధంగా చర్యలు తీసుకుంటే కొబ్బరి రైతుల ఆదాయం పెంచడంతో పాటుగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వీలుంటుందని అభిప్రాయ‌ప‌డ్డారు ఎంపీ హ‌రీష్ బాల‌యోగి.

Also Read : Beauty Sitara Daughter Birthday : శ్రీ‌లంక‌లో సితార పుట్టిన రోజు వేడుక‌లు

Exit mobile version