ఢిల్లీ : ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నోరు పారేసు కోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ తో పాటు బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి లోక్ సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చేసిన కామెంట్స్ ను కావాలని వక్రీకరించారని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఎంపీ చామల కౌంటర్ ఇచ్చారు.
డీసీసీ నూతన అధ్యక్షుల సమావేశంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ అని రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారని వేరెవ్వరినీ ఉద్దేశించి ఒక్క మాట కూడా చులకన చేసి మాట్లాడ లేదని చెప్పారు ఎంపీ.
కాంగ్రెస్ పార్టీలో మల్టిపుల్ లీడర్ షిప్ ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. హిందువుల్లో అనేక రకాల దేవుళ్ళు, దేవతలు ఉన్నారని ఆయన చెప్పారని అన్నారు. కులాన్ని,మతాన్ని ఇబ్బంది పెట్టే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడ లేదని స్పష్ం చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. అయిఏ సందిట్లో సడేమియా అన్న చందంగా బీజేపీ, బీఆర్ఎస్ కావాలని బద్నాం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని , బుద్ది చెప్పేందుకు రెడీగా ఉన్నారని అన్నారు ఎంపీ. ఇకనుంచి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని పేర్కొన్నారు.
