Morning : చాలా మందికి ఉదయం నిద్రలేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం, టీ కంటే ఆరోగ్యానికి మేలు చేసే మరో సులభమైన పరిష్కారం ఉంది. అదే – దాల్చిన చెక్క నీరు. దీనిని ప్రతి రోజు ఉదయం (Morning) తాగడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Morning – దాల్చిన చెక్క – ఒక ఆరోగ్య నిధి
దాల్చిన చెక్క కేవలం రుచికి మాత్రమేగాక, ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఔషధ గుణాలనూ కలిగి ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం వంటి విషయాల్లో ఉపయోగపడతాయి.
దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
- చక్కెర స్థాయిని నియంత్రణ
- జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం
- రుతుక్రమ సంబంధిత ఇబ్బందుల్లో ఉపశమనం
- జీర్ణక్రియ మెరుగవడం
- కంటి చూపును కాపాడటం
- రోగనిరోధక శక్తిని పెంపొందించటం
- మెదడు పనితీరు మెరుగవటం, జ్ఞాపకశక్తి బలపడటం
- అలసట తగ్గించడం, శరీరానికి శక్తిని అందించడం
వాడే విధానం:
ఉదయం టీ తాగే బదులు, కొద్ది దాల్చిన చెక్క ముక్కలను నీటిలో మరిగించి, అవసరమైతే కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు. దీనిని రోజువారీ అలవాటుగా మార్చుకుంటే దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ సమాచారం అందుబాటులో ఉన్న అధ్యయనాలు మరియు నిపుణుల సూచనల ఆధారంగా తయారుచేయబడింది. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా వాడకానికి ముందు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.
Also Read : Walking Interesting Benefits : ప్రతిరోజూ వాకింగ్ ఇలా చేస్తే మీ నడుము నొప్పి మాయం
