Walking : వెన్ను లేదా నడుము నొప్పి సమస్యతో బాధపడుతున్నారా? ఎంత మందులు వాడినప్పటికీ మళ్లీ మళ్లీ అదే సమస్య వస్తున్నట్లే అనిపిస్తోందా? అయితే ఇక చింతించాల్సిన అవసరం లేదు. ఈ సాధారణమైన అలవాటు మీ సమస్యకు శాశ్వత పరిష్కారమవుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అది మరేదీ కాదు – ప్రతిరోజూ నడక (Walking).
Walking Benefits
ప్రస్తుతం బహుళంగా ఉన్న నిశ్చల జీవనశైలి కారణంగా, రోజూ కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చునే ఉద్యోగులు, ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేస్తున్నవారిలో నడుము నొప్పి అత్యంత సాధారణ సమస్యగా మారింది. ఇది పురుషులకంటే ఎక్కువగా మహిళలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు, రోజంతా కూర్చునే పని చేసే ఉద్యోగుల మధ్య ఎక్కువగా కనిపిస్తోంది.
నడకతో నడుము నొప్పిపై నియంత్రణ
తాజాగా JAMA నెట్‌వర్క్ ఓపెన్ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ సుమారు 78 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ నడిచే వ్యక్తులు దీర్ఘకాలిక నడుము నొప్పిని ఎదుర్కొనే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వెల్లడించారు. దీర్ఘకాలికంగా కూర్చోవడం వల్ల కలిగే ప్రభావాన్ని ‘డెడ్ బట్ సిండ్రోమ్’ అని పిలుస్తారు. ఇది ప్రధానంగా నిత్యం కదలకుండా ఉండే జీవనశైలి వల్ల ఏర్పడుతుంది.
వాకింగ్‌ను రోజువారీ జీవితంలో భాగంగా మార్చండి
అతి తక్కువ ఖర్చుతో, ఎలాంటి మందులు లేకుండానే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే మార్గాల్లో వాకింగ్ ఒకటి. ఇది శరీరంలోని కీళ్లను చురుకుగా ఉంచడంతోపాటు వెన్నెముకకు సరైన మద్దతు కల్పిస్తుంది. రోజుకు కనీసం ఒక గంట నడవడం ద్వారా నడుము నొప్పిని సమర్థవంతంగా తగ్గించవచ్చు.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్‌లో లభ్యమయ్యే అధ్యయనాల ఆధారంగా మీకు అందించబడింది. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.
Also Read : Monsoon Danger Fruits : వర్షాకాలంలో ఆ పళ్ళు తిన్నారో ఇక మీ పని అంతే
