Moody’s : ప్రపంచ ప్రఖ్యాత రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ భారత దీర్ఘకాలిక లోకల్ కరెన్సీ, విదేశీ కరెన్సీ ఇష్యూర్ రేటింగ్స్‌ను Baa3 వద్ద ‘స్థిరంగా’ కొనసాగించింది. అలాగే, షార్ట్-టర్మ్ లోకల్ కరెన్సీ రేటింగ్‌ను P-3 వద్ద కూడా కొనసాగించింది.
Moody’s Updates
మూడీస్ (Moody’s) ప్రకటనలో, భారత్‌కు ఉన్న విస్తృతమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, స్థిరమైన బాహ్య పరిస్థితులు, నిరంతర ఫిస్కల్ లోటును నిర్వహించగల దేశీయ వనరులు రేటింగ్ స్థిరంగా ఉండటానికి ప్రధాన కారణాలుగా పేర్కొంది.
అమెరికా సుంకాలు పెరగడం, అంతర్జాతీయ విధాన పరిమితులు పెట్టుబడులను ప్రభావితం చేస్తున్నప్పటికీ, భారత్ ఆర్థిక వ్యవస్థకు ఉన్న బలాలు బాహ్య ప్రతికూల పరిస్థితులను తట్టుకునే సామర్థ్యాన్ని ఇస్తున్నాయని మూడీస్ విశ్లేషించింది.
అయితే, ఆర్థిక లోటు, అధిక అప్పులు వంటి దీర్ఘకాలిక బలహీనతలు కొనసాగుతాయని సంస్థ హెచ్చరించింది. జీడీపీ వృద్ధి, కొంత మేర ఫిస్కల్ నియంత్రణ ఉన్నప్పటికీ, ప్రభుత్వ అప్పు తగ్గుదల చాలా నెమ్మదిగా జరుగుతుందని, దాంతో రుణ భారం భరించగల సామర్థ్యం పెద్దగా మెరుగుపడదని పేర్కొంది.
ఇక, భారత్ దీర్ఘకాలిక లోకల్ కరెన్సీ బాండ్ సీలింగ్‌ను A2 వద్ద, విదేశీ కరెన్సీ బాండ్ సీలింగ్‌ను A3 వద్ద యథాతథంగా ఉంచింది. పాలసీ స్థిరత్వం, ప్రభుత్వం ఆర్థిక రంగంలో అధిక ప్రమేయం, స్వల్ప కరెంట్ అకౌంట్ లోటు వంటి అంశాలు రేటింగ్ స్థాయిని ప్రభావితం చేస్తున్నాయని మూడీస్ వివరించింది.
అలాగే, భారత్‌కు ఉన్న తక్కువ బాహ్య అప్పులు, ఇటీవల ప్రవేశపెట్టిన నాన్-రెసిడెంట్ పెట్టుబడుల సడలింపులు వల్ల రుణ మోరటోరియం అవకాశం తక్కువగా ఉంటుందని కూడా రేటింగ్ ఏజెన్సీ వెల్లడించింది.
మూడీస్ తాజా నిర్ణయం ద్వారా, భారత్ స్థిరమైన ఆర్థిక బలాలు, అంతర్జాతీయ పెట్టుబడిదారుల విశ్వాసం కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది.
Also Read : NPCI Important Update : అక్టోబర్ 1 నుంచి దేశంలో సంచలనమైన ఆర్థిక మార్పులు
