NPCI Important Update : అక్టోబర్ 1 నుంచి దేశంలో సంచలనమైన ఆర్థిక మార్పులు

రాబోయే అక్టోబర్ 1, 2025 నుంచి అమల్లోకి రాబోయే ఐదు కీలక మార్పులు ఇవి:..

Hello Telugu - NPCI Important Update

Hello Telugu - NPCI Important Update

NPCI : మన దేశంలో ప్రతినెలా ఒకటో తేదీ నుంచి కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి వస్తుంటాయి. ఇవి సాధారణ ప్రజల జీవితంపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావం చూపుతాయి. రాబోయే అక్టోబర్ 1, 2025 నుంచి అమల్లోకి రాబోయే ఐదు కీలక మార్పులు ఇవి:

NPCI –  నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS):

ఇకపై ఎన్‌పీఎస్ చందాదారులు తమ పెట్టుబడులను వందశాతం ఈక్విటీల్లో పెట్టే వీలు ఉంటుంది. ఇప్పటివరకు ప్రభుత్వేతర పెన్షన్ హోల్డర్లకు ఈక్విటీ పెట్టుబడుల్లో 75 శాతం వరకు మాత్రమే అనుమతి ఉండేది. ఈ మార్పు పెట్టుబడిదారులకు మరిన్ని అవకాశాలను కల్పించనుంది.

వంట గ్యాస్ ధరలు:

ప్రతి నెలలాగే అక్టోబర్ 1 నుంచి కూడా ఎల్‌పీజీ కమర్షియల్ సిలిండర్ల ధరల్లో మార్పులు వస్తాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను పునః సమీక్షించడంతో కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.

యూపీఐ లావాదేవీలు:

అక్టోబర్ 1 నుంచి యూపీఐ ఐడీ ద్వారా పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్స్ నిలిపివేయబడతాయి. అంటే నేరుగా యూపీఐ ఐడి ద్వారా ఒకరి నుంచి మరొకరికి డబ్బు పంపడం ఇక సాధ్యం కాదు. అయితే స్కాన్‌ చేయడం లేదా మొబైల్ నెంబర్ ద్వారా చెల్లింపులు కొనసాగుతాయి. ఈ మార్పు సైబర్ నేరాలను తగ్గించేందుకు, వినియోగదారుల భద్రతను పెంచేందుకు తీసుకున్న చర్యగా NPCI వెల్లడించింది.

రైల్వే టికెట్ బుకింగ్:

అక్టోబర్ 1 నుంచి మొదటి 15 నిమిషాల రిజర్వేషన్ సమయంలో ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసిన ప్రయాణికులకే టికెట్లు లభిస్తాయి. దీంతో అక్రమ బుకింగ్స్ తగ్గించి, నిజమైన ప్రయాణికులకు సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఉందని రైల్వే శాఖ చెబుతోంది.

ఆన్‌లైన్ గేమింగ్:

ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం డబ్బు పెట్టి ఆడే ఆన్‌లైన్ గేమ్స్ అన్నీ నిషేధం కావచ్చు. ఈ చర్యతో ఆన్‌లైన్ మోసాలు, అక్రమ లావాదేవీలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Also Read : Indian Railways Important Update : దసరా, దీపావళికి భారీ బహుమతి ప్రకటించిన రైల్వే శాఖ

Exit mobile version