Monsoon Diseases Crisis : వర్షాకాలంలో ఆ వ్యాధుల పట్ల అప్రమత్తత చాలా అవసరం

ఫలితంగా జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వేగంగా వ్యాపించే అవకాశం ఉంది...

Hello Telugu - Monsoon Diseases Crisis

Hello Telugu - Monsoon Diseases Crisis

Monsoon Diseases : వర్షాకాలం ప్రారంభమైన వెంటనే అనారోగ్యాల ముప్పు పెరుగుతుంది. తేమతో కూడిన వాతావరణం, నిలిచిపోయిన నీరు, గాలి కాలుష్యం వంటి పరిస్థితులు దోమలు, బ్యాక్టీరియా, వైరస్‌లు పెరిగేకు అనువుగా మారతాయి. ఫలితంగా జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వేగంగా వ్యాపించే అవకాశం ఉంది.

Monsoon Diseases – వైరల్ ఫీవర్‌ను తేలికగా తీసుకోవద్దు

ఈ కాలంలో సాధారణంగా కనిపించే వైరల్ జ్వరం మొదట అలసట, నొప్పులు, గొంతు ఇబ్బంది, తేలికపాటి దగ్గుతో మొదలవుతుంది. కానీ ఇవే లక్షణాలు డెంగ్యూ లేదా మలేరియాలోనూ ఉంటాయి. అందువల్ల, “ఇది సాధారణ జ్వరం” అని భావించి నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

డెంగ్యూ, మలేరియా ముప్పు ఎక్కువ

వర్షాకాలంలో (Monsoon) నిలిచిన నీటి కారణంగా దోమలు వేగంగా వ్యాప్తి చెందతాయి. డెంగ్యూ దోమలు ఎక్కువగా పగటిపూట కుడతాయి, మలేరియా దోమలు రాత్రిపూట కుడతాయి. ఈ వ్యాధుల్లోనూ జ్వరం, తలనొప్పి, చలి, ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

టైఫాయిడ్, జీర్ణ సంబంధిత ఇన్ఫెక్షన్ల ముప్పు

నిర్లక్ష్యంగా తినే ఆహారం, నీటి కాలుష్యం వల్ల టైఫాయిడ్ లాంటి వ్యాధులు రావచ్చు. ముఖ్యంగా రోడ్డు పక్కన లభించే ఫుడ్‌ ఐటమ్స్, ముందే కట్ చేసి ఉంచిన పండ్లు, శుభ్రత లేని నీరు ప్రధానంగా ఇన్ఫెక్షన్‌కు దారితీస్తాయి. కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు, బలహీనత, అధిక జ్వరం వంటి లక్షణాలు కలిగి ఉంటాయి.

ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా వేగంగా వ్యాపిస్తాయి

వర్షాల (Monsoon) కారణంగా తడిగా ఉండే బట్టలు, చెమట వల్ల చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ముఖ్యంగా మెడ, చంక, కాలి వేళ్ల మధ్య ఇలా జరగొచ్చు. దురదను లైట్‌గా తీసుకోవద్దు – ఇది ప్రాథమిక లక్షణం కావచ్చు.

జాగ్రత్తలే రక్షణ మార్గం

తేమతో నిండి ఉండే వర్షాకాలాన్ని ఆరోగ్యంగా గడపాలంటే పరిశుభ్రత, ఆహార నియమాలు తప్పనిసరి. జాగ్రత్తలతో ఉండటం ద్వారానే కుటుంబాన్ని అనారోగ్యాల నుంచి కాపాడుకోవచ్చు.

ఈ కథనం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. సమస్యలు ఉంటే వైద్యుల సలహా తీసుకోవాలి.

Also Read : Milk and Curd Interesting Facts : మీరు ఖాళీ కడుపుతో పాలు లేదా పెరుగు తీసుకుంటున్నారా అయితే ఇది చూడండి

Exit mobile version