Modi Govt Important Update : తెలంగాణలో హ్యామ్ రోడ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

రూ.25,661 కోట్లతో రహదారి నిర్మాణాలకు ఆమోదం

Hello Telugu - Modi Govt Important Update

Hello Telugu - Modi Govt Important Update

Modi : హైద‌రాబాద్ : కేంద్రంలోని మోదీ (Modi) ప్ర‌భుత్వం ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. తెలంగాణ రాష్ట్రానికి హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్న‌ట్లు తెలిపింది. ఇందులో భాగంగా హ్యామ్ ర‌హ‌దారుల నిర్మాణం కోసం రూ. 25,661 కోట్లకు ఆమోదానికి ఓకే చెప్పింది కేంద్రం. ఇదిలా ఉండ‌గా జాతీయ రహదారుల జాబితాలో తెలంగాణ నుంచి ఐదు హైవేలకు చోటు క‌ల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 431 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి అనుమతి ఇస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. హ్యామ్ విధానంలో కేంద్రం-ఎన్‌హెచ్ఏఐ నిధుల్లో 40:60 నిష్పత్తిగా ఉంటుంద‌ని పేర్కొంది. ఆర్మూర్-జగిత్యాల రహదారి నాలుగు లేన్లుగా విస్త‌రిస్తారు. ఇందుకు గాను జగిత్యాల-మంచిర్యాల హైవే విస్తరణకు రూ.2,550 కోట్ల మంజూరు చేస్తున్న‌ట్లు పేర్కొంది.

Modi Govt Important Update

జగిత్యాల-కరీంనగర్ రహదారికి రూ. 2,384 కోట్లు కేటాయించింది కేంద్రం. ఆర్మూర్-జగిత్యాల రహదారి నిర్మాణానికి రూ.2,338 కోట్లు ఆమోదం తెలిపింది. హైదరాబాద్ ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుకు రూ.15,627 కోట్ల నిధుల కేటాయించింది కేంద్రం. మహబూబ్‌నగర్-రాయచూర్ రహదారి ఫోర్ లేన్‌గా విస్తరణకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి రూ.2,662 కోట్లు మంజూరు చేస్తున్న‌ట్లు తెలిపింది. రోడ్డు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్ ను వ్యతిరేకిస్తున్న కాంట్రాక్టర్ల నుండి పదేపదే విజ్ఞప్తులు, ఆందోళనలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం వీలైనంత త్వరగా దాని అమలుతో ముందుకు సాగాలని నిర్ణయించింది.

Also Read : Jajula Srinivas Goud Challenge : బీసీ రిజ‌ర్వేష‌న్ల కోసం యుద్దానికి సిద్దం

Exit mobile version