Jajula Srinivas Goud : హైదరాబాద్ : బీసీల రిజర్వేషన్ల సాధన కోసం ప్రత్యక్ష యుద్దానికి కూడా సిద్దంగా ఉన్నామని సంచలన ప్రకటన చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud). హైదరాబాద్ లో బీసీ జేఏసీ సమావేశం జరిగింది. చైర్మన్ గా ఎంపీ ఆర్. కృష్ణయ్యను , జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud) ను వర్కింగ్ చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఈ మేరకు సమావేశం కీలక తీర్మాణాలు చేసింది. రాష్ట్రంలో 60 శాతం బీసీలు ఉండగా రెడ్డీలు కేవలం 5 శాతం మాత్రమే ఉన్నారని, కీలక పదవుల్లో వాళ్లే రాజ్యం ఏలుతున్నారని ధ్వజమెత్తారు. 60 శాతం ఉన్న బీసీ సమాజానికి 5 శాతం ఉన్న రెడ్డి సమాజం సవాలు విసురుతోందని అన్నారు. ఆ సవాలును స్వీకరిస్తున్నామన్నారు. 60 శాతం జనాభా ఉంటే 18 శాతం తగ్గిస్తూ 42 శాతం ఇస్తున్నా కొందరు రెడ్డీలు బీసీ రిజర్వేషన్ కు గండి కొట్టేందుకు ఒక్కటి కావడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Jajula Srinivas Goud Shocking Comments
ఏ ఒక్క రెడ్డి సంఘం మద్దతు ప్రకటించ లేదని మండిపడ్డారు జాజుల శ్రీనివాస్ గౌడ్. పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా బీసీ రిజర్వేషన్ల సాధన అనే ఒకే ఎజెండాతో మేమంతా ఒక్కటయ్యామని చెప్పారు. రాష్ట్రంలోని రెండున్నర కోట్ల మంది బీసీల ప్రయోజనాల కోసం ఆర్ కృష్ణన్న బంద్ కు పిలుపునిచ్చారని అన్నారు. రాష్ట్రంలో 136 కులాలు, 60 శాతం జనాభాగా ఉన్నది బీసీలేనని వెల్లడించారు. తెలంగాణలోని రెడ్ల ఆధిపత్యాన్ని పాతరేసేందుకే బీసీ జేఏసీ ఏర్పాటయిందన్నారు. రెడ్లను బీసీలు ముఖ్యమంత్రులను చేస్తే రెడ్లు మాత్రం బీసీలను కనీసం సర్పంచులు కూడా కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు జాజుల శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ గడ్డ మీద బీసీ బిడ్డను ముఖ్యమంత్రిని చేసే దాకా బీసీ జేఏసీ పని చేస్తుందని ప్రకటించారు. 18న బంద్ కు మద్దతిచ్చిన వాళ్ళంతా 42 శాతం రిజర్వేషన్ కు మద్దతిచ్చినట్టేనని అన్నారు. బంద్ కు మద్దతివ్వాలని అన్ని కులసంఘాలు, విద్యా, వ్యాపార సంస్థలు, ఆర్టీసీ సహా అనేక సంస్థలు, సంఘాలను కోరుతున్నాం అన్నారు.
Also Read : CM Revanth Reddy New Innovation : శ్రీరాం సాగర్ ప్రాజజెక్టుకు రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు
