MLC Nagababu : గుంటూరు జిల్లా : జనసేనా పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు కొణిదల నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు. ఏటికొప్పాక బొమ్మలకు ప్రపంచ వ్యాప్తంగా పేరుందన్నారు. సాంకేతిక పరంగా మరింత మెరుగులు దిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కదిలే బొమ్మల తయారీ కోసం పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. అంతే కాకుండా రాష్ట్రంలో కొలువు తీరిన కూటమి సర్కార్ వచ్చాక ఏటికొప్పాక బొమ్మల తయారీదారులకు అన్ని వేళలా అండగా ఉంటుందన్నారు నాగబాబు కొణిదల (MLC Nagababu). అంతే కాకుండా ఉప ముఖ్యమత్రి పవన్ కళ్యాణ్ కొణిదల ఏటి కొప్పాకపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. గతంలో ఎన్నికల సందర్బంగా తాము ఏం చెప్పామో, వాటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
MLC Nagababu Key Comments
ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ ఏటికొప్పాకను సందర్శించారు. వృత్తి పరంగా ఏటికొప్పాక తయారీదారులు అత్యంత ప్రతిభా నైపుణ్యం కలిగి ఉన్నారని చెప్పారు. ప్రతి ఒక్క వృత్తి కళాకారుడికి మేలు చేకూర్చేలా తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రత్యేకించి తన సోదరుడు, పవన్ కళ్యాణ్ కు ఏటికొప్పాక బొమ్మలంటే అత్యంత ఇష్టమన్నారు. అందుకే వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నం చేశారన్నారు. వారు తయారు చేసే ఏటికొప్పాక బొమ్మలకు మరింత మెరుగైన మద్దతు ధర దక్కేలా, ప్రపంచ మార్కెట్ లో డిమాండు ఉండేలా కృషి చేస్తామని చెప్పారు నాగబాబు కొణిదల.
Also Read : Pawan Kalyan New Innovation for Panchayat : పంచాయతీ పునర్వ్యవస్థీకరణతో మెరుగైన సేవలు
