Congress Govt Important Update : వానాకాలం సీజ‌న్ లో ధాన్యం కొనుగోళ్లు

రేవంత్ రెడ్డి స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యాలు

Hello Telugu - Congress Govt Important Update

Hello Telugu - Congress Govt Important Update

Congress : హైద‌రాబాద్ : వానాకాలం సీజ‌న్ లో రైతుల కోసం కొనుగోలు కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర మంత్రివ‌ర్గం నిర్ణ‌యించింది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ వానాకాలంలో 1.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచ‌నా వేశారు. దేశంలోనే ఇది రికార్డు స్థాయి ఉత్పత్తి అని పేర్కొంది. ఇందులో రాష్ట్రంలో 80 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల విభాగం అంచనా వేసింది.కేంద్ర ప్ర‌భుత్వం 50 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల సేక‌ర‌ణ‌కు అంగీక‌రించింది, మ‌రో 15 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు సేక‌రించాల‌ని కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. వానా కాలం సీజన్లో పండించిన ధాన్యం కొనుగోళ్ల‌ను ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాల‌ని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Congress Govt key Update

వ్య‌వ‌సాయ శాఖ‌, రెవెన్యూ శాఖ‌, పౌర‌ స‌ర‌ఫ‌రాల శాఖ, ర‌వాణా శాఖ స‌మ‌న్వ‌యంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ‌ చేపట్టాలని నిర్ణయించింది. ధాన్యానికి చెల్లించే మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు ఇచ్చే రూ.500 బోన‌స్ రైతుల ఖాతాల్లో వెంట‌ వెంటనే జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. క‌లెక్ట‌ర్లు, అద‌న‌పుక లెక్ట‌ర్లు కొనుగోలు కేంద్రాల‌ను త‌నిఖీ చేయాలని ప్ర‌తి కొనుగోలు కేంద్రం ప‌ర్య‌వేక్ష‌ణ‌, స‌మ‌న్వ‌యానికి ఒక్కో అధికారికి ప్రత్యేక బాధ్య‌త‌లు అప్ప‌గించాలని తీర్మానం చేశారు. రాష్ట్రంలో కొత్తగా మూడు (3) అగ్రికల్చర్ కాలేజీల ఏర్పాటు కు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. హుజూర్ నగర్, కొడంగల్, నిజామాబాద్ లో అగ్రికల్చర్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం.

కృష్ణా-వికారాబాద్ బ్రాడ్‌గేజ్ రైలు మార్గం నిర్మాణానికి సంబంధించి 845 హైక్టార్ల భూ సేక‌ర‌ణ‌కు అయ్యే రూ.438 కోట్ల వ్య‌యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌రించేందుకు అంగీక‌రించింది. మ‌న్న‌నూర్‌-శ్రీ‌శైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి మొత్తం వ్యయంలో మూడో వంతు రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌రించేందుకు అంగీక‌రిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది.

Also Read : Hydraa Important Update : అమీర్‌పేట ముంపున‌కు హైడ్రా ప‌రిష్కారం

Exit mobile version