MLC Nagababu Interesting Update : జ‌న‌సేనానికి అర్చ‌కుల ధన్యావాదాలు

ఎమ్మెల్సీ శ్రీ కె. నాగబాబుని ధార్మిక పరివార్

Hello Telugu - MLC Nagababu Interesting Update

Hello Telugu - MLC Nagababu Interesting Update

MLC Nagababu : అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ అమ‌లు చేస్తున్న తల్లికి వందనం, ఇతర సంక్షేమ పథకాలలో అర్చకులలో అర్హులైన ప్రతి లబ్దిదారునికి అందే విధంగా కృషి చేయాలని శాస‌న మండ‌లిలో ప్ర‌భుత్వాన్ని కోరారు జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ కొణిద‌ల నాగ‌బాబు (MLC Nagababu). ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలోని అర్చ‌కులు పెద్ద ఎత్తున సంతోషం వ్య‌క్తం చేశారు. ఇందులో భాగంగా అర్చకుల తరపున ధార్మిక పరివార్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ధార్మిక పరివార్ వ్యవస్థాపకులు బాల శ్రీనివాసులు, జాతీయ అధ్యక్షులు వి.వి.రామారావు, ప్రధాన కార్యదర్శి అక్కిరాజు గోపాలరావు, ఉపాధ్యక్షులు బులుసు రఘునాథ్ శాసనమండలి సభ్యులు కె. నాగబాబుని కలిసి తమ సంతోషాన్ని తెలియజేశారు. ఆయ‌న‌ను ఘ‌నంగా స‌న్మానించారు.

MLC Nagababu Meet

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్చకుల సంక్షేమం కొరకు ఇస్తున్న ధూప, దీప నైవేద్య పథకం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచడం శుభ పరిణామమని అన్నారు, దీనిలో గౌరవ వేతనంగా రూ. 7 వేలు, ‘పడితరం’ రూ. 3 వేలు ప్రతి అర్చకుడుకి ఇస్తున్నారని తెలిపారు. ఈ పథకాన్ని రూ. 10 వేలు ఆదాయంగా పరిగణించడం కారణంగా అర్చకులు తల్లికి వందనం పథకం పొందలేక పోతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్ర వ్యాప్త సమస్యగా గుర్తించి అర్చకుల పిల్లలకు తల్లికి వందనం, ఇతర సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయాలని నాగ‌బాబు కోర‌డం ప‌ట్ల అర్చ‌కులు , కుటుంబాలు పెద్ద ఎత్తున ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Also Read : PM Modi Important Updates on Srisailam : 16న శ్రీ‌శైలానికి రానున్న ప్ర‌ధాని

Exit mobile version