MLC Kavitha Shocking Comments : న‌న్ను డ్యామేజ్ చేయ‌డంలో బీఆర్ఎస్ నేత హ‌స్తం

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత

Hello Telugu - MLC Kavitha Shocking Comments

Hello Telugu - MLC Kavitha Shocking Comments

MLC Kavitha : హైద‌రాబాద్ – ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను ఒంట‌రిని చేసి శున‌కానందం పొందుతున్నార‌ని మండిప‌డ్డారు. ఆ వ్యాఖ్యల వెనుక ఓ బీఆర్ఎస్ పెద్ద నాయకుడి ప్రమేయం ఉందంటూ ఆరోపించారు. నల్లొండ జిల్లాలో ఓ లిల్లీపుట్ నాయకుడు బీఆర్ఎస్ పార్టీని నాశనం చేశాడని ఫైర్ అయ్యారు. ఆదివారం క‌విత (MLC Kavitha) మీడియాతో మాట్లాడారు. ప‌రోక్షంగా మాజీ మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డిని ప‌రోక్షంగా ప్ర‌స్తావించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. త‌ను ఓ లిల్లీపుట్..త‌న గురించి కామెంట్స్ చేస్తాడా అని ఫైర్ అయ్యారు. త‌ను నల్లొండ జిల్లా లో భార‌తీయ రాష్ట్ర స‌మితి పార్టీ ని నాశనం చేశాడని మండిప‌డ్డారు.

MLC Kavitha Shocking Comments

చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు ఏదో గెలిచాడంటూ ఎద్దేవా చేశారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. జిల్లాలో అన్ని సీట్లు ఓడి పోవడానికి కారణం ఆయనేని ఆరోపించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పై తీవ్రంగా విరుచుకు పడ్డారు. త‌న‌ గురించి ఇంకోసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
మరో వైపు ఇంకో ఆసక్తికర విషయాన్ని కవిత బయట పెట్టారు. బీఆర్ఎస్ లో ఓ సీనియ‌ర్ నేత త‌మ జాగృతి సంస్థ‌లో కొంద‌రు కోవ‌ర్టుల‌ను పెట్టాడ‌ని, ఇక్క‌డి స‌మాచార‌మంతా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

ఆ నాయకుడికి చెబుతున్నా, మీ దగ్గర కూడా నా మనుషులు ఉన్నారని ప్ర‌క‌టించారు. అక్కడ ఏం జరుగుతుందో త‌న‌కు బాగా తెలుస‌న్నారు క‌విత‌. ఆ ముఖ్య నాయకుడి ఆదేశాలతోనే నాపై జరుగుతున్న దాడులపై పార్టీ నేతలు స్పందించడం లేదని స్పష్టమైన సమాచారం ఉందన్నారు.

Also Read : MLC Kavitha Shocking Comments : మోసం కాంగ్రెస్ పార్టీ నైజం : క‌ల్వ‌కుంట్ల క‌విత

Exit mobile version