MLC Kavitha Fired on BJP : బీజేపీ మోసం బీసీల‌కు శాపం – క‌విత

డ్యూయ‌ల్ రోల్ పోషిస్తున్న‌ద‌ని ఆగ్ర‌హం

Hello Telugu - MLC Kavitha Fired on BJP

Hello Telugu - MLC Kavitha Fired on BJP

MLC Kavitha : హైద‌రాబాద్ – ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత బీజేపీపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు. బీసీల‌కు ఆ పార్టీ వ్య‌తిరేక‌మ‌న్నారు. అందుకే 42 శాతం బీసీ రిజ‌ర్వేష‌న్ బిల్లును ఆమోదించ‌కుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. బీసీల నోటి కాడ ముద్దను బీజేపీ గుంజుకునే ప్రయత్నం చేస్తోందంటూ మండిప‌డ్డారు. బీసీ వ్యతిరేక వైఖరిని ప్రజలంతా గమనిస్తున్నార‌ని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లలో ముస్లింలు ఉన్నారో లేదో క్లారిటీగా చెప్ప లేద‌న్నారు. బండి సంజయ్ ఎందుకు ముస్లింల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారంటూ ప్ర‌శ్నించారు.

MLC Kavitha Slams BJP

బుధ‌వారం ఎమ్మెల్సీ క‌విత (MLC Kavitha) మీడియాతో మాట్లాడారు. అంత‌కు ముందు ఆమె తెలంగాణ జాతిపిత , సిద్దాంత‌క‌ర్త దివంగ‌త ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ జ‌యంతి సంద‌ర్బంగా ఆయ‌న విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ఆయ‌న తెలంగాణ ఉద్య‌మ వ్యాప్తికి ప‌ని చేశార‌ని కొనియాడారు. ఆయ‌న ముందు చూపు, కేసీఆర్ దార్శ‌నిక‌త , పోరాటం వ‌ల్ల‌నే రాష్ట్రం సిద్దించింద‌ని చెప్పారు. తెలంగాణ ఉన్నంత వ‌ర‌కు ఈ దేశంలో చిర‌స్థాయిగా జ‌య‌శంక‌ర్ పేరు నిలిచి పోతుంద‌న్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఇక బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల‌నే స‌దాలోచ‌న కాంగ్రెస్ పార్టీకి లేద‌న్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ కేబినెట్ లో , ప‌రిపాల‌నా ప‌రంగా ఎంత మంది బీసీల‌కు ప‌ద‌వులు ఇచ్చారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు

బీజేపీ అధ్య‌క్షుడు రాంచంద‌ర్ రావు ఓ మాట మాట్లాడితే కేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్, ఎంపీలు ఇంకోలా మాట్లాడుతున్నార‌ని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. రాబోయే రోజుల్లో బీసీలు బీజేపీకి త‌గిన రీతిలో బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు. తాను ముందు నుంచి బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు కావాల‌ని కోరాన‌ని అన్నారు.

Also Read : AP Cabinet Approved : ఆగ‌స్టు 15 నుంచి మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం

Exit mobile version