AP Cabinet Approved : ఆగ‌స్టు 15 నుంచి మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం

కీల‌క అంశాల‌కు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్

Hello Telugu - AP Cabinet Approved

Hello Telugu - AP Cabinet Approved

AP Cabinet : అమ‌రావ‌తి – ఏపీ ప్ర‌భుత్వం మంత్రివ‌ర్గం కీల‌క అంశాల‌కు ఆమోదం తెలిపింది. మ‌హిళ‌ల‌కు తీపి క‌బురు చెప్పింది. ఆగ‌స్టు 15 నుంచి మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ప్ర‌ధానంగా 12 అంశాల‌పై చ‌ర్చించిన‌ట్లు చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ రేష‌న్ కార్డు పంపిణీ చేస్తామ‌న్నారు. ఈ ప్ర‌క్రియ‌కు ఈనెల 25 నుంచి శ్రీ‌కారం చుడుతున్న‌ట్లు తెలిపారు. అంతే కాకుండా నూత‌న మ‌ద్యం పాల‌సీని ఆమోదించ‌డం జ‌రిగింద‌న్నారు. నాయి బ్రాహ్మణలకు 150 యూనిట్ల నుండి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కు ఆమోదం తెలిపింద‌ని వెల్ల‌డించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు.

AP Cabinet Approved for Free Bus

ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ టెక్ హబ్ పాలసీ 4.0కి కూడా కేబినెట్ ఓకే చెప్పింద‌న్నారు. ఏపీ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలోని 22 ఏపీటీడీసీ హోట‌ళ్ల‌ను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించేందుకు అనుమతి ఇస్తూ కేబినెట్ (AP Cabinet) ఓకే చెప్పింద‌న్నారు సీఎం. తిరుపతి రూరల్ మండలంలోని పేరూరు గ్రామంలో ఓబరాయ్ హోటల్ నిర్మాణానికి కేటాయించిన 25 ఎకరాల టీటీడీ భూ బదలాయింపు రద్దుకు నిర్ణయం తీసుకుంద‌న్నారు. పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ కు ఎస్బీఐ, యూబీఐ బ్యాంకులకు రూ.900 కోట్లు గ్యారెంటీ ఇస్తూ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింద‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఏపీఐఐసీకి రూ. 7500 కోట్ల రుణం తీసుకునేందుకు క్యాబినెట్ ఆమోదం ఆమోదం తెలిపింద‌న్నారు. 5 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు అనుమతి ఇస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంద‌న్నారు సీఎం. మావోయిస్ట్ పార్టీ, ఆర్ డీ ఎఫ్ పార్టీ కార్యకలాపాలపై మరో ఏడాది పాటు నిషేధం విధిస్తున్న‌ట్లు తెలిపారు.

Also Read : Bhumana Karunakar Reddy Shocking Comments : బీఆర్ నాయుడు ప్ర‌వ‌క్త లాగా మాట్లాడితే ఎలా..?

Exit mobile version