MLC Kavitha : హైదరాబాద్ – తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా, కించపరిచేలా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కమిటీ ఆన్ ఎథిక్స్ కు రెఫర్ చేయాలని కోరుతూ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి లేఖ రాశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha). గౌరవ చట్ట సభలో సభ్యుడిగా ఉన్న మల్లన్న తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఒక మహిళ అన్న గౌరవం లేకుండా సభ్య సమాజం తల దించుకునేలా కామెంట్స్ చేస్తారా అని ప్రశ్నించారు. మీ ఇంటి ఆడ పడుచు లేదా మీ భార్య, మీ కుటుంబంలో ఉన్న మహిళల పట్ల కూడా కంచం మంచం అని వాడతారా అంటూ నిలదీశారు.
MLC Kavitha Slams
ఒక గౌరవమైన పదవిలో ఉన్న మల్లన్న ఇంత దిగజారుడు భాష మాట్లాడటం తగదన్నారు కల్వకుంట్ల కవిత. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష ప్రజా ప్రతినిధుల పట్ల అత్యంత జుగుస్సాకరంగా కామెంట్స్ చేస్తున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్దతి కాదని సూచించారు. వ్యవస్థలను కాపాడాల్సిన వాళ్లు వాటి రూల్స్ ను పక్కదోవ పట్టించేలా కామెంట్స్ చేయడం ఎంత వరకు సబబు అన్నారు.
గత కొంత కాలం నుంచి తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తీన్మార్ మల్లన్న, ఆయన పరివారం అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తన గురించి లేనిపోని అవాకులు చెవాకులు పేలడంతో తమ తెలంగాణ జాగృతి సంస్థకు చెందిన కార్యకర్తలు సంయమనం కోల్పోవాల్సి వచ్చిందన్నారు. కావాలని దాడికి పాల్పడలేదని స్పష్టం చేశారు.
Also Read : Ram Gopal Varma – Kota Death : ఇచ్చిన పాత్రకు న్యాయం చేసిన నటుడు
