Ram Gopal Varma – Kota Death : ఇచ్చిన పాత్ర‌కు న్యాయం చేసిన న‌టుడు

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ

Hello Telugu - Ram Gopal Varma - Kota Death

Hello Telugu - Ram Gopal Varma - Kota Death

Ram Gopal Varma : హైద‌రాబాద్ – ప్ర‌ముఖ న‌టుడు కోట శ్రీ‌నివాస‌రావు మృతి చెంద‌డం ప‌ట్ల స్పందించారు ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ (Ram Gopal Varma). త‌ను తీసిన గాయం, అన‌గ‌న‌గా ఒక రోజు , త‌దిత‌ర సినిమాల‌లో కీల‌క పాత్ర‌లు పోషించారు కోట‌. ఈ సంద‌ర్బంగా ఎక్స్ వేదిక‌గా ఆదివారం అరుదైన ఫోటోను పంచుకున్నారు. అన‌గ‌న‌గా ఒక రోజు మూవీ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో తాను పాత్ర గురించి చెబుతున్న స‌మ‌యంలో కోట శ్రీ‌నివాస‌రావుతో దిగిన ఫోటోను షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. త‌ను ఏ పాత్ర ఇచ్చినా దానికి 100 శాతం న్యాయం చేశాడ‌ని, ఇలాంటి గొప్ప న‌టుడు లేడ‌న్న నిజాన్ని తాను జీర్ణించు కోలేక పోతున్నాన‌ని పేర్కొన్నాడు ఆర్జీవీ.

Ram Gopal Varma Comments

ఇదిలా ఉండ‌గా కోట శ్రీ‌నివాస రావు సినీ ప్ర‌స్థానం చిరంజీవి న‌టించిన ప్రాణం ఖ‌రీదుతో ప్రారంభ‌మైంది. ఆయ‌న స్వ‌స్థ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా. విలన్ గా, కమెడియన్, తండ్రిగా, తాతగా, రాజకీయ నాయకుడిగా, పిసినారిగా, పోలీసుగా ఇలా అద్భుతమైన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావుల శకం తర్వాత ఆ లోటును భర్తీ చేశారు.

నటనా ప‌రంగా తెలుగునాట చెరిగిపోని ముద్ర వేశారు కోట శ్రీనివాసరావు. ఆయన నటన చిరస్మరణీయం. సినీ క‌ళామ‌త‌ల్లి ఉన్నంత వ‌ర‌కు తను వెలుగుతూనే ఉంటారు. ఓవైపు న‌టుడిగా ఇంకో వైపు రాజ‌కీయ నాయ‌కుడిగా ఉన్నా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను నిల‌బెట్టుకున్నారు. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌లో ముఖ్య భూమిక పోషించారు. త‌న‌కు ఎదురే లేద‌ని చాటారు కోట శ్రీ‌నివాస‌రావు. రాష్ట్ర‌, జాతీయ స్థాయిలో అవార్డులు, పుర‌స్కారాలు అందుకున్నారు.

Also Read : Nagababu – Kota Death : అసాధార‌ణ‌మైన న‌టుడు కోట శ్రీ‌నివాస రావు

Exit mobile version