Montha Cyclone : అమరావతి : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు మొంథా తుపాను పరేషన్ చేయడం ఖాయమని హెచ్చరించింది. నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తుపాన్ పొంచి ఉందని తెలిపారు ఎండీ ప్రఖర్ జైన్. గడిచిన 3గంటల్లో గంటకు 18 కి.మీ వేగంతో మొంథా తుపాన్ (Montha Cyclone) కదులుతోందన్నారు. ప్రస్తుతానికి చెన్నైకి 600కి.మీ, విశాఖపట్నంకి 710 కి.మీ, కాకినాడకి 680 కి.మీ దూరంలో కేంద్రీ కృతమై ఉందని తెలిపారు ఎండీ. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. వాతావరణం ప్రశాంతంగా ఉందని అశ్రద్ధగా ఉండ వద్దని హెచ్చరించారు ప్రఖర్ జైన్.
Montha Cyclone Updates
ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని స్పష్టం చేశారు. సోమవవారం కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి కూడా వర్షాలు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నారు. తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు మేనేజింగ్ డైరెక్టర్ .
Also Read : KTR Shocking Comments : తెలంగాణలో రౌడీ షీటర్ల పాలన : కేటీఆర్
