MLA Somireddy Fired on YS Jagan : ప్రతిపక్ష హోదా అడుక్కుంటే రాదు

ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి

Hello Telugu - MLA Somireddy Fired on YS Jagan

Hello Telugu - MLA Somireddy Fired on YS Jagan

MLA Somireddy : నెల్లూరు జిల్లా – మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహ‌న్ రెడ్డి (MLA Somireddy) నిప్పులు చెరిగారు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రెడ్డిపై. ప్ర‌తిప‌క్ష హోదా అన్న‌ది ప‌దే ప‌దే అడుక్కుంటే రాద‌ని, అది ప్ర‌జ‌లు ఇస్తే వ‌స్తుంద‌ని అన్నారు. ఆ మాత్రం సోయి లేకుండా జ‌గ‌న్ మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు. సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పులివెందుల ప్రజలకు కూడా ఎంట్రీ పాస్ లు ఇవ్వ‌డం దారుణ‌మ‌న్నారు. నియంత పోకడల నుంచి ఇంకా బయటకు జగన్ రెడ్డి రాలేక పోతున్నార‌న్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయ్యింద‌న్నారు. ఏ ఊరికి వెళ్లినా ప్రజలు మమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారని చెప్పారు.

MLA Somireddy Slams Ex CM YS Jagan

గొడ్డలి పోటుతో చిన్నాయన వివేకానంద రెడ్డిని లేపేసిన మీరా మా నాయకుడి గురించి మాట్లాడేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్పటికైనా కొంచెం కాకపోతే కొంచెమైనా బుద్ధితో మాట్లాడాల‌ని సూచించారు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి. గతంలో సకల శాఖల మంత్రిగా వెలగబెట్టిన సజ్జల వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయంంటూ ఎద్దేవా చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల‌న‌డంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం ఎన్నిసార్లు అడుక్కుంటారంటూ ప్ర‌శ్నించారు. సంవత్సరం మూడు నెలల నుంచి అడుక్కోవడమే మీ ప‌నిగా మారిందంటూ పేర్కొన్నారు.

Also Read : KCR Shocking Decision : బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ క‌విత బహిష్క‌ర‌ణ

Exit mobile version