KCR Shocking Decision : బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ క‌విత బహిష్క‌ర‌ణ

సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న పార్టీ చీఫ్ కేసీఆర్

Hello Telugu - KCR Shocking Decision

Hello Telugu - KCR Shocking Decision

KCR : హైద‌రాబాద్ – బీఆర్ఎస్ పార్టీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. త‌మ పార్టీ నుంచి ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించింది. గ‌త కొంత కాలంగా పార్టీపై తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తోంది. కుటుంబ విభేదాలు, లీక్ అయిన లేఖ వ్య‌వ‌హారం సంచ‌ల‌నంగా మారింది. ఎమ్మెల్సీ క‌విత వ్య‌వ‌హారం ఇటీవ‌లి పార్టీ రూల్స్ కు విరుద్దంగా ఉందంటూ పేర్కొంది. దీని కార‌ణంగా పార్టీ తీవ్రంగా ప‌రిగ‌ణించింది. త‌మ పార్టీ చీఫ్ కె. చంద్ర‌శేఖ‌ర్ రావు (KCR) త‌క్ష‌ణ‌మే త‌న‌ను స‌స్పెండ్ చేయాల‌ని ఆదేశించార‌ని పార్టీ కార్య‌ద‌ర్శి ర‌వీంద‌ర్ స్ప‌ష్టం చేశారు. అయితే చాలా కాలం నుంచి త‌న‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించ‌డం ఖాయ‌మ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అంద‌రూ అనుకున్న‌ట్లుగా క‌విత‌పై వేటు ప‌డింది.

KCR Shocking to MLC Kavitha

గ‌త మే నెల‌లో క‌విత త‌న తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి లేఖ బ‌హిర్గ‌త‌మైంది. ఇది తీవ్ర దుమారానికి దారి తీసింది. పార్టీ అనురిస్తున్న మౌనం, బీసీ రిజ‌ర్వేష‌న్ల ప‌రిష్క‌రించ‌డంలో వైఫ‌ల్యాన్ని, త‌న‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌క పోవ‌డంపై క‌విత విమ‌ర్శించింది. అమెరికాలో ఉన్నప్పుడు వెలుగులోకి వచ్చిన లేఖను సంతోష్ కుమార్ లీక్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. కవిత తన లేఖను సమర్థించుకుంటూ, కేసీఆర్‌ను దేవుడిలాంటివాడు అని అభివర్ణించింది. కానీ ఆయనను దెయ్యాలు చుట్టు ముట్టాయని, వారు ఆయనను తప్పుదారి పట్టించారని, నిజమైన అభిప్రాయాన్ని తెలియ జేయకుండా ఆపారని ఆరోపించారు. తనను అప్రతిష్టపాలు చేయడానికి లోపలి వ్యక్తుల నోట్ లీక్ చేశారని ఆమె ఆరోపించింది .

Also Read : Minister Narayana Interesting Update : ఎల్ఓఏ ఇచ్చేందుకు ప్ర‌భుత్వం ఆమోదం : నారాయ‌ణ

Exit mobile version