MLA Raja Singh Fired on TG BJP Chief : రామ‌చందర్ రావు రైట‌ర్ కానీ ఫైట‌ర్ కాదు

నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే రాజా సింగ్

Hello Telugu - MLA Raja Singh Fired on TG BJP Chief

Hello Telugu - MLA Raja Singh Fired on TG BJP Chief

MLA Raja Singh : హైద‌రాబాద్ – గోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను మ‌ళ్లీ పిలిచినా బీజేపీలో చేరే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. త‌న‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్న మాధ‌వీల‌త‌పై మండిప‌డ్డారు. ప‌దే ప‌దే త‌న‌ను రెచ్చ‌గొట్టేలా కామెంట్స్ చేయ‌డం త‌న‌కే మంచిది కాద‌న్నారు. ప‌నిలో ప‌నిగా బీజేపీ చీఫ్ రామ‌చందర్ రావుపై సెటైర్ వేశారు. ఆయ‌న రైట‌ర్ కానీ ఫైట‌ర్ కాద‌న్నారు. బీజేపీలోని ఒక మహిళా శక్తి బృందంతో నాపై కావాల‌ని వ్య‌క్తిగ‌తంగా దుష్ప్ర‌చారం చేయిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

MLA Raja Singh Slams Telangana BJP Chief

ఎమ్మెల్యే రాజా సింగ్ (MLA Raja Singh) మీడియాతో మాట్లాడారు. త‌ను ఇటీవ‌లే బీజేపీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు రాజీనామా లేఖ‌ను కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి పంపించారు. తిరిగి మీపై విమర్శలు చేసే అంత చిన్నస్థాయి నాది కాదంటూ పేర్కొన్నారు. దమ్ముంటే ఫేస్ టు ఫేస్ ముందుకు రావాల‌ని కానీ ప్ర‌చారం చేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు రాజా సింగ్. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఫైటర్ కావాలన్నారు. రామచందర్ రావు ఆ పోస్ట్ కు స‌రిపోడ‌న్నారు. తాను ఏ రోజూ పదవి ఆశించ లేద‌న్నారు. ఎందుకంటే వాళ్లు ప్రపోజ్ చేయరు, ఇవ్వరని తెలుసు అన్నారు.

నా గతి కార్యకర్తల గతి ఇంతేనంటూ వాపోయారు రాజా సింగ్. ఎంతో బాధతోనే పార్టీకి రాజీనామా చేయ‌డం జ‌రిగింద‌న్నారు. బీజేపీ హైకమాండ్ ఐబీ రిపోర్ట్ తెప్పించు కుంటుందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాక పోవడానికి ఎవరు కారణం, వెన్ను పోటు ఎవరు పొడిచారు అన్నది తేలి పోతుందన్నారు. అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడేంత పెద్ద వాడిని కానంటూ స్ప‌ష్టం చేశారు. అమిత్ షా నాకు ఎప్పుడూ ఫోన్ చేయలేదు, చేయరు కూడా అన్నారు. తెలంగాణ బీజేపీలో చాలా తప్పులు జరుగుతున్నాయంటూ బాంబు పేల్చారు.

Also Read : Popular Journalist Rana Ayyub : రేవంత్ రెడ్డితో రానా అయూబ్ ముచ్చ‌ట‌

Exit mobile version