Popular Journalist Rana Ayyub : రేవంత్ రెడ్డితో రానా అయూబ్ ముచ్చ‌ట‌

శాలువా క‌ప్పి స‌న్మానించిన ముఖ్య‌మంత్రి

Hello Telugu - Popular Journalist Rana Ayyub

Hello Telugu - Popular Journalist Rana Ayyub

Rana Ayyub : హైద‌రాబాద్ – ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ రానా అయ్యూబ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. భార‌త దేశంపై ఆమె పుస్త‌కం రాస్తున్నారు. ప‌రిశోధ‌న‌లో భాగంగా త‌న‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి సీఎం స్థాయికి ఎలా ఎదిగాన‌నే విష‌యంపై ఆయ‌న త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నారు. రానా అయ్యూబ్ ను స‌న్మానించారు.

Journalist Rana Ayyub Meet CM Revanth Reddy

ఇదిలా ఉండ‌గా రానా అయ్యూబ్ (Rana Ayyub) కాల‌మిస్ట్ గా , ర‌చ‌యిత‌గా, జ‌ర్న‌లిస్టుగా గుర్తింపు పొందారు. రాణా అయూబ్ మే 1, 1984లో పుట్టారు. ది వాషింగ్టన్ పోస్ట్ లో ఒపీనియన్ కాలమిస్ట్ గా ఉన్నారు. గుజరాత్ ఫైల్స్ – అనాటమీ ఆఫ్ ఎ కవర్ అప్ అనే పరిశోధనాత్మక పుస్తకం రాశారు. ఇది సంచ‌ల‌నం సృష్టించింది. ప్ర‌ధానంగా ప్ర‌ధాని మోదీ, కేంద్ర స‌ర్కార్ పై విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు.

రానా అయూబ్ ముంబైలో జన్మించారు. ఆమె తండ్రి ముహమ్మద్ అయూబ్ వకీఫ్. ముంబైకి చెందిన బ్లిట్జ్ అనే పత్రికలో రచయిత, అభ్యుదయ రచయితల ఉద్యమంలో సభ్యుడు. ఆమె మేనమామ అబ్దుల్ హక్ అజ్మీ హదీసు విశిష్ట పండితుడు, దారుల్ ఉలూమ్ దేవ్బంద్లో సీనియర్ ప్రొఫెసర్ గా పనిచేశారు. రానా అయూబ్ ముంబైలోని సోఫియా కళాశాల నుండి ఆంగ్ల సాహిత్యంలో ప‌ట్టా పొందారు. జ‌ర్న‌లిస్టుగా ప్ర‌త్యేక‌త క‌లిగి ఉన్నారు. త‌న‌కు ఎన్నో అవార్డులు, పుర‌స్కారాలు ద‌క్కాయి.

అక్టోబర్ 2011 లో రానా అయూబ్ (Rana Ayyub) జర్నలిజంలో అత్యుత్తమ ప్రతిభకు సంస్కృతి అవార్డును అందుకున్నారు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో రాష్ట్ర ఉన్నతాధికారుల భాగస్వామ్యాన్ని బహిర్గతం చేసిన రహస్య దర్యాప్తున‌కు గాను త‌న‌కు 2017 ఎడిషన్ గ్లోబల్ షైనింగ్ లైట్ అవార్డు ద‌క్కింది. 2016లో వచ్చిన చాక్ ఎన్ డస్టర్ అనే సినిమాలో తన స్నేహితురాలు కూడా అయిన రానా అయూబ్ నటన తనకు స్ఫూర్తినిచ్చిందని నటి రిచా చద్దా పేర్కొంది. ఈ సినిమాలో ఆమె జర్నలిస్ట్ పాత్ర పోషించింది . 2018లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ వేధింపులకు గురైనప్పటికీ, మరణ బెదిరింపులు ఎదుర్కొంటున్నప్పటికీ తన పనిని కొనసాగించినందుకు రానా అయూబ్‌కు ఫ్రీ ప్రెస్ అన్‌లిమిటెడ్ ద్వారా మోస్ట్ రెసిలెంట్ జర్నలిస్ట్ అవార్డు లభించింది.

2019 లో టైమ్ మ్యాగజైన్ పది మంది ప్రపంచ జర్నలిస్టులలో ఒకరిగా అయూబ్‌ను జాబితా చేసింది.
ఫిబ్రవరి 2020లో జార్జియా విశ్వ విద్యాలయంలోని గ్రేడీ కళాశాలలో జర్నలిస్టిక్ ధైర్య సాహసాలకు గాను త‌న‌కు మెక్‌గిల్ పతకం లభించింది. 2021లో టెక్సాస్ టెక్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్ నుండి అయూబ్ ఎక్సలెన్స్ ఇన్ ఇంటర్నేషనల్ జర్నలిజం అండ్ హ్యూమన్ రైట్స్ అవార్డును అందుకున్నారు . ఓవర్సీస్ ప్రెస్ క్లబ్ అవార్డు లభించింది . 28 జూన్ 2022న, అయూబ్‌కు నేషనల్ ప్రెస్ క్లబ్ ద్వారా అంతర్జాతీయ జాన్ ఆబుచాన్ అవార్డు లభించింది. 23 అక్టోబర్ 2024న, అయూబ్‌కు కెనడియన్ జర్నలిస్ట్స్ ఫర్ ఫ్రీ ఎక్స్‌ప్రెషన్ (CJFE) ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు ద‌క్కింది.

Also Read : TCS Shocking Employees : టీసీఎస్ లో 12,000 జాబ్స్ పై వేటు

Exit mobile version