MLA Komatireddy Shocking Comments : రేవంత్ రెడ్డి భాష దారుణం – రాజగోపాల్ రెడ్డి

మ‌రోసారి ముఖ్య‌మంత్రిపై షాకింగ్ కామెంట్స్

Hello Telugu - MLA Komatireddy Shocking Comments

Hello Telugu - MLA Komatireddy Shocking Comments

MLA Komatireddy : హైద‌రాబాద్ – మ‌రోసారి ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి . త‌న భాష దారుణంగా ఉంద‌ని, దానిని మార్చుకుంటే మంచిద‌న్నారు. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు. సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న‌కు మంత్రి పదవి విషయంలో హైకమాండ్ ప్రామిస్ చేసిందన్నారు. అయితే మంత్రి పదవి విషయం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తెలియదన్నారు. బుధ‌వారం రాజ‌గోపాల్ రెడ్డి (MLA Komatireddy) మీడియాతో మాట్లాడారు. ప్ర‌జ‌లు తీవ్ర అస‌హ‌నంతో ఉన్నార‌ని చెప్పారు. గ‌తంలో ప‌ని చేసిన ఏ ముఖ్య‌మంత్రి కూడా ఇలాంటి భాష వాడ లేద‌న్నారు.

MLA Komatireddy Shocking Comments on CM Revanth Reddy

ప్ర‌త్యేకించి ఆంధ్రాకు చెందిన కాంట్రాక్ట‌ర్ల‌కే ప‌నులు ద‌క్కుతున్నాయంటూ వాపోయారు. ఇదే స‌మ‌యంలో తెలంగాణ‌కు చెందిన వారు ఎక్క‌డికి పోవాలంటూ ప్ర‌శ్నించారు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి. త‌న ఒక్క‌డి వ‌ల్ల‌నే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేద‌న్నారు. అంద‌రూ క‌లిసి క‌ట్టుగా కృషి చేస్తే, పోరాడితే, కేసుల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డితే వ‌చ్చామ‌న్నారు. కానీ రేవంత్ రెడ్డి ఒన్ మ్యాన్ షో చేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు ఎమ్మెల్యే. ఇదిలా ఉండ‌గా సోష‌ల్ మీడియా, డిజిట‌ల్ మీడియా గురించి సీఎం చేసిన వ్యాఖ్య‌ల‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు రాజ‌గోపాల్ రెడ్డి. తాను సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Also Read : Telangana BJP Chief Shocking Comments : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ట‌చ్ లో ఉన్నారు

Exit mobile version