Telangana BJP Chief Shocking Comments : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ట‌చ్ లో ఉన్నారు

బీజేపీ అధ్య‌క్షుడు రాం చంద‌ర్ రావు కామెంట్స్

Hello Telugu - Telangana BJP Chief Shocking Comments

Hello Telugu - Telangana BJP Chief Shocking Comments

BJP Chief : హైద‌రాబాద్ – తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని బాంబు పేల్చారు. బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ నేతలు కూడా త‌మ పార్టీవైపు చూస్తున్నార‌ని అన్నారు. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ మొత్తం కేసీఆర్ డైరెక్షన్ లో జరిగిందేన‌ని ఆరోపించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్య‌క్తం చేశారు. ఈ విష‌యంలో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు బీజేపీ చీఫ్‌ (BJP Chief). రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స‌ర్కార్ డ‌బుల్ గేమ్ ఆడుతోంద‌ని ఆరోపించారు. ప్ర‌జ‌లు అంతా గ‌మ‌నిస్తున్నార‌ని ఈ విష‌యం తెలుసుకుంటే మంచిద‌న్నారు.

Telangana BJP Chief Key Comments

బీజేపీ స్టాండ్ బీసీలకు రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేసే విష‌యంపై పూర్తి క్లారిటీతో ఉంద‌న్నారు రాంచంద‌ర్ రావు. కామారెడ్డిలో రాహుల్ గాంధీ విడుద‌ల చేసింది బిసీ డిక్ల‌రేష‌న్ కాద‌న్నారు. అది ముస్లిం డిక్ల‌రేష‌న్ అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. బీజేపీ పూర్తి ఏ ఒక్క వ‌ర్గానికో కొమ్ము కాయ‌ద‌న్నారు. తాము ఎవ‌రికీ అన్యాయం చేయ‌మ‌న్నారు. ఇవాళ గ‌త కొన్నేళ్లుగా దేశంలో మోదీ హ‌వా కొన‌సాగుతోంద‌న్నారు. రాష్ట్రంలో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పూర్తిగా వైఫ‌ల్యం చెందాయ‌ని, ఇప్పుడు ప్ర‌జ‌ల ముందు ఉన్న ఏకైక ప్ర‌త్యామ్నాయం బీజేపీ త‌ప్పా మ‌రో పార్టీ దరి దాపుల్లో లేద‌న్నారు రాం చంద‌ర్ రావు . కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్యేలు సైతం త‌న‌కు టచ్ లో ఉన్నారంటూ స్పష్టం చేశారు.

Also Read : ED Raids Shocking – Crypto : క్రిప్టో, హ‌వాలా నెట్ వ‌ర్క్ పై ఈడీ దాడులు

Exit mobile version