MLA Raj gopal Reddy Shocking Comments : ప‌దేళ్ల పాటు తానే సీఎం అంటే ఎలా..?

నిప్పులు చెరిగిన రాజ గోపాల్ రెడ్డి

Hello Telugu - MLA Raj gopal Reddy Shocking Comments

Hello Telugu - MLA Raj gopal Reddy Shocking Comments

Raj gopal Reddy : హైద‌రాబాద్ – మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి (Raj gopal Reddy) సీరియ‌స్ కామెంట్స్ చేశారు. రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించు కోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమ‌న్నారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్య బద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరని స్ప‌ష్టం చేశారు. ఎక్స్ వేదిక‌గా ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

MLA Raj gopal Reddy Shocking Comments

ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీలో ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న చందంగా త‌యారైంది. ఈ త‌రుణంలో కొల్లాపూర్ వేదిక‌గా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లు సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం కల‌క‌లం రేపింది. ఇప్పుడే కాదు 2034 వ‌ర‌కు తానే సీఎంగా ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. దీనిపై మొద‌ట‌గా స్పందించారు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి. ఇది పూర్తిగా పార్టీ విధానాలు, రూల్స్ కు విరుద్ద‌మంటూ పేర్కొన్నారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

గ‌త కొన్నేళ్లుగా పార్టీని న‌డుముకుని ఉన్న నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఏమై పోవాలంటూ ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికే త‌న‌కు మంత్రి ప‌ద‌వి కావాల‌ని ఆశిస్తున్నారు. పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నం చేశారు. ఈసారి జ‌రిగిన కేబినెట్ విస్త‌ర‌ణలో చోటు ద‌క్క‌క పోవ‌డంతో నిరాశ‌లో ఉన్నారు. ఎంతో మంది త‌మ కుటుంబాల‌ను వ‌దిలేసి గ‌త 10 ఏళ్ల బీఆర్ఎస్ అరాచ‌క పాల‌న‌ను త‌ట్టుకుని నిల‌బడ్డార‌ని వారి సంగతి ఏం కావాలంటూ ప్ర‌శ్నించారు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి.

Also Read : CM Revanth Reddy Interesting Comments : బాబూ మ‌మ్మ‌ల్ని బ‌త‌క‌నీయ‌వా ప్లీజ్

Exit mobile version